తుంగభద్ర పుష్కరాలు 2020 : నవంబర్ 20 మధ్యాహ్నం 1.23 గంటలకు ప్రారంభం

0
2179
తుంగభద్ర పుష్కరాలు 2020

తుంగభద్ర పుష్కరాలు 2020 అలంపూర్ రెడీ అయింది . జోగులాంబ గద్వాల్ జిల్లా అధికారులు పుష్కరాలను విజయవంత చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసారు . నవంబర్ 20 మధ్యాహ్నం 1.23 గంటలకు ప్రారంభం తుంగ‌భ‌ద్ర పుష్క‌రాలు ప్రారంభం కానున్నాయి . కరోనా దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా విడుదల చేసింది .

తుంగభద్ర పుష్కరాలు 2020

తుంగభద్ర పుష్కరాలు 2020

తుంగభద్ర పుష్కరాలు 2020 నవంబర్ నుండి డిసెంబర్ 1 వ తారీకు జరుగుతాయి . అంటే 12 రోజుల పాటు నిర్వహించనున్నారు . పుష్కరాల ప్రారంభోత్సవంలో మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొననున్నారు . అలాగే శ్రీ మాధవనంద స్వామి, శ్రీ కమలానంద భారతి స్వామిజీల‌కు దేవాదాయ శాఖ‌ పుష్కరాలకు ఆహ్వానం పంపింది .

పుష్కరాలను మ‌ధ్యాహ్నం 1.23 గంట‌ల‌కు తొగుట పీఠాధిపతి మాధవనంద స్వామి, హిందూ దేవాలయ ప్రతిష్టాన్ పీఠాధిపతి కమలానంద భారతి స్వామిజీ శాస్త్రోక్తంగా అలంపూర్ ఘాట్ వద్ద ప్రారంభించనున్నారు .

 1. 50 కోట్లను తుంగభద్ర పుష్కరాల నిర్వహణ కోసం విడుదల చేసినట్టు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు . పితృ దేవతలకు పిండ ప్రదానం చేసేందుకు 100కు పైగా పురోహితులను ఎంపిక చేసి, వారికి గుర్తింపు కార్డులను అందజేశామ‌న్నారు. వాటికీ సంబందించిన రేట్లను దేవాదాయ శాఖ నిర్ణయించి షెడ్ల వద్ద డిస్ప్లే చేసినట్టు చెప్పారు .

కరోనా దృష్ట్యా రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాలు

 1. ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కే పుష్క‌రాల
  నిర్వ‌హ‌ణ‌కు అనుమతి .
 2. ప‌దేళ్ల లోపు పిల్ల‌లు, గ‌ర్భిణీలు, 65 ఏళ్ల పైబ‌డిన‌వారు పుష్క‌రాల‌కు
  రావొద్ద‌ని ప్రభుత్వం తెలిపింది .
 3. నెగిటివ్ రిపోర్టుతో వ‌చ్చిన వారికే పుష్క‌ర ‌ఘాట్ల‌లోకి
  అనుమ‌తించ‌నున్నారు
 4. ఆరు అడుగుల భౌతిక దూరం పాటిస్తూ కొవిడ్
  నిబంధ‌న‌ల‌కు లోబ‌డి పుష్క‌ర స్నానాల‌కు అనుమ‌తి .
 5. టెస్టు రిపోర్టు లేకుండా వ‌చ్చే వారికి థ‌ర్మ‌ల్ స్ర్కీనింగ్ అనంత‌రం
  అనుమ‌తి
 6. పుష్క‌ర‌ఘాట్లు, ఆల‌య ప్ర‌వేశ ద్వారాల వ‌ద్ద శానిటైజ‌ర్లు, థ‌ర్మ‌ల్
  స్క్రీనింగ్ ఏర్పాటు .

Also Read

కార్తీక మాసం 2020 విశిష్టత చేయవలసిన పూజలు- Special