తెలంగాణలోదీపావళి క్రాకర్స్ కాల్చడం అమ్మకం నిషేధించాలి అంటూ హై కోర్ట్ తెలంగాణ ప్రభుత్వం ని ఆదేశించింది . దీపావళి సందర్భంగా బాణా సంచా కాల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో గురువారం పిల్ న్యాయస్థానం ఆదేశించింది .

తెలంగాణలోదీపావళి క్రాకర్స్
కరోనా వ్యాప్తి దృష్ట్యా బాణా సంచా కాల్చడం పై నిషేధం విధించాలని పిటిషనర్ కోరాడు . పలు రాష్ట్రాల హై కోర్ట్ లు , సుప్రీం కోర్ట్ ఇప్పటికే నిషేదించిన విసయాన్ని కోర్ట్ కు తెలియ చేస్తూ ఇక్కడ కూడా అలాంటి చర్యలు తీసుకోవాలి అని కోరాడు .
కరోనా తీవ్రత ఎక్కువగా ఉనందున , ప్రభుత్వం కూడా కొరోనా పై అదే అభిప్రాయం తో ఉనందున ఇప్పుడు ఉన్న పరిస్థుతులలో బాణాసంచా వాడకం సరైనది కాదు అనేది విచారణ సందర్భంగా కోర్ట్ కూడా అభిప్రాయం వెలిబుచ్చింది .
తెలంగాణ అడ్వొకేట్ జనరల్ ఇప్పటికే చాల చోట్ల బాణాసంచా అమ్మకాలు చేస్తున్నారు అని కోర్టుకి తెలిపాడు . దానికి కోర్ట్ వాటన్నిటిని ప్రభుత్వమే నిరోధించాలి , అలాగే వాటి వాళ్ళ కలిగే దుష్ప్రభావాలను ప్రజలలో విస్తృత ప్రచారం చేయాలి అని తెలిపింది .
బాణాసంచా నిషేధం గురుంచి ప్రజలలో కల్పించిన అవగాహన అలాగే ఎలాంటి చర్యలు తీసుకున్నారో నవంబర్ 19 లోపల నివేదిక సమర్పించాలని నాయస్థానం అడ్వకేట్ జనరల్ ని కోరింది .
ఢిల్లీ ,రాజస్థాన్ , కర్ణాటక ,ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే బాణాసంచాపై నిషేధం విధించాయి . మహారాష్ట్ర ప్రభుత్వం క్రాకర్స్ కాల్చవద్దని , కరోనా బాధితులు చాల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి అని కోరింది . బెంగాల్ లో అయితే కాళీమాత పూజల సందర్భంలోనే నిషేదించింది .
Also Read