తెలంగాణలో గత కొన్ని రోజులుగా యెడ తెరిపి లేకుండా బారి వర్షలు కురుస్తూనే ఉన్నాయి .రాబోయే కొన్ని రోజులలో బారి నుండి అతి బారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెపుతుంది . దీనితో సీఎం కేసీఆర్ అధికారులతో సమావేశమై చర్చించారు . కరీంనగర్ ,ఖమ్మం ,వరంగల్ ,నిజామాబాదు ,ఆదిలాబాద్ జిల్లాలో అతి బారి వర్షాల ముప్పు ఉంది అని వెల్లడించింది . ఆయా జిల్లాలో కలెక్టర్ అప్రమత్తం ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది .
ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్ ,ఎస్పీ లతో సమావేశమై తీసుకోవలసిన జాగ్రత్తలు చర్చించారు . ఉన్నత అధికారులు అందరూ జిల్లా హెడ్ క్కుటర్స్ లో అందుబాటులో ఉండి పరిస్థి అంచనా వేయాలని సూచించారు .
లోతట్టు ప్రాంతాలు మునిగి పోకుండా చర్యలు తీసుకోని వారిని అప్రమత్తం చేయాలనీ తెలిపారు . తీవ్ర గాలులకు చెట్లు పడిపోవడం ,విధ్యుత్ స్థంబాలు దెబ్బతిని ప్రజలకు ఇబ్బంది పడే అవకాశం ఉంది .అలంటి వాటిని త్వరిత గతిన ప్రరిష్కరించాలి అని ఆదేశించారు .