తెలంగాణ సంక్షేమ పథకాలు బీజేపీ అధికారంలో ఉన్న 12 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా రైతు బంధు,రైతు భీమా,కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్,2016 రూ. ఆసరా పెన్షన్ లాంటివి ఇస్తున్నారా అని ఎల్లారెడ్డి సభలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు .

బండి సంజయ్ కు సవాల్ చేస్తున్న,మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకాలు ఎందుకు లేవు. కేసీఆర్ ప్రభుత్వం కంటే మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్క మెరుగైన పథకం చూపించు. దీనిపై పచ్చి అబద్ధాలు మాట్లాడే బీజేపీ నాయకుల్ని ప్రజలు ప్రశ్నించాలి. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అబద్ధాలను నిజం చేయాలనుకుంటున్నారు. పాలు-నీళ్లు వేరు చేసినట్లు మీ అబద్ధాలు ప్రజల ముందుంచుతాం. మీకు సరైన సమయంలో ప్రజలు సరైన సమాధానం చెప్తారు అని అన్నారు .
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో స్థానిక శాసన సభ్యులు జాజాల సురేందర్ తో కలిసి రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, భూమిపూజ,ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.ఎల్లారెడ్డి చెరువు కట్టపై 3.56 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించే రోడ్ శంకుస్థాపన తో పాటు 5 కోట్లతో నిర్మించే బ్రిడ్జి నిర్మాణ పనుల శంకుస్థాపన మరియు భూమిపూజ నిర్వహించారు.
ఎల్లారెడ్డి పట్టణంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనుల భూమిపూజ కార్యక్రమం అనంతరం ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో నిర్మించిన నూతన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ (అధికారిక భవనం) ను స్థానిక ఎమ్మెల్యే,జడ్పీ చైర్ పర్సన్ దాఫెదార్ శోభరాజు,జిల్లా కలెక్టర్ శరత్, పలువురు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి వేముల ప్రారంభించారు.
అనంతరం ఎల్లారెడ్డి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుందన్నారు.నియోజకవర్గ అభివృద్ధి కోసం నా వంతు సహకారం తప్పకుండా ఉంటుందన్నారు.ఆర్ అండ్ బి శాఖ తరుపున మరికొన్ని నూతన రోడ్లు మంజూరు చేసినట్లు చెప్పారు.బాల్కొండ నియోజకవర్గం నాకు ఎంత ఇష్టమో ఎల్లారెడ్డి నియోజకవర్గం అంత ఇష్టమని, స్థానిక ఎమ్మెల్యే సురేందర్ తో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్…ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు,ప్రజా సమస్యలు సత్వర పరిష్కారాల కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు నిర్మించారన్నారు.
ఇటీవల కొంతమంది కేసీఆర్ ప్రభుత్వం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న తెలంగాణ సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అని ప్రశ్నించారు.రైతు బంధు,రైతు భీమా,రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్,మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీళ్లు, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్,2016 రూ. ఆసరా పెన్షన్ లాంటివి..బీజేపీ అధికారంలో ఉన్న 12 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా ఇస్తున్నారా అని అన్నారు.బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు.కేసీఆర్ ప్రభుత్వం కంటే మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్క మెరుగైన సంక్షేమ పథకం చూపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు సవాల్ విసిరారు. నిత్యం అబద్ధాలు ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకుల్ని ఈ విషయంపై ప్రజలు ప్రశ్నించాలన్నారు.
aloprostadil https://alprostadildrugs.com/ alprostadil intraurethral (muse) therapy
tadalafil tablets https://elitadalafill.com/ tadalafil gel
sildenafil cheap no prescription https://eunicesildenafilcitrate.com/ purchase sildenafil citrate
vardenafil hcl generic https://vegavardenafil.com/ cheap vardenafil