దేశీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ కరోనా వైరస్ కోసం టారు చేసిన కోవిద్ 19 వ్యాక్సిన్ కోవాగ్జిన్ 375 మంది వలంటీర్ల పై జులై 15 న డబుల్ బ్లెండ్ ,ప్లాసిబో కంట్రోల్డ్ ర్యాన్దమైజ్డ్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్లు తెలియచేసింది .

హరియాణా హెల్త్ మినిస్టర్ అనిల్ విజ్ మాట్లాడుతూ కోవాగ్జిన్ మానవ ప్రయోగాలు శుక్రవారం నుండి హరియానలోని పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇస్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ లో ప్రారంబమయ్యాయి ,వ్యాక్సిన్ ఇచ్చిన ముగ్గురు వాలంటరీలు అందరు బాగానే వున్నారు ఎలాంటి రియాక్షన్స్ లేవు అని అన్నారు .
ఇదేవిదం దేశ వ్యాప్తంగా ఎపిక చేసిన అన్ని ఆసుపత్రులలో ట్రైల్స్ మొదలయినాయి .తెలంగాణలోని నిమ్స్ లో మొత్తం 12 వలంటీర్లను ఎంపిక చేసి ఎంపిక చేసి అన్నిరకాల పరీక్షలు చేసి ICMR ల్యాబ్ కు పంపారు .అక్కడనుండి అనుమతులు రాగానే ప్రయోగం మొదలుపెడతారు .విశాఖపట్నం లోని కింగ్ జార్జి ఆసుపత్రికి అనుమతులు రాగానే ప్రయోగాలు మొదలు పెడతామని అక్కడి అధికారులు చెప్పారు .భారత బయోటెక్ ICMR తో కలసి కోవిద్ 19 వ్యాక్సిన్ మొదటి దశ ప్రయోగాలను అధిగ మించిన విషయం తెలిసిందే .