ధరణి పోర్టల్ మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది . వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు , మ్యుటేషన్ సేవలు దీని ద్వారా చాల సులభం కానున్నాయి.

ధరణి పోర్టల్ పై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక ద్రుష్టి పెట్టింది .దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం రాష్ట్ర తాసిల్దారు కార్యాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందుబాటలోకి తీసుకువస్తుంది . పోర్టల్ కు సంబందించిన విడి విధానాలను ప్రభుత్వం జారీచేసింది .దసరా పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు చేసున్నారు .ప్రభుత్వం భూముల రెజిస్ట్రేషన్స్ పారదర్శకంగా ఉండేందుకే ఈ పోర్టల్ ను ప్రవేశ పెడుతున్నారు .
ధరణి పోర్టల్ మార్గదర్శకాలు
పాత పద్దతిలో భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఆ భూమి పై హక్కులకోసం మ్యుటేషన్ కు దరకాస్తు చేసుకోవలసి వచ్చేది . కానీ ఇప్పుడు కొత్త పద్దతిలో రిజిస్ట్రేషన్ కాగానే మన కొన్న భూమి విస్తీర్ణం కొన్నవారి ఖాతాలోకి నమోదు అవుతుంది . మన దగ్గర పాస్ బుక్ లేకపోయే ఈ – పాస్ పుస్తకాలూ జారీచేస్తారు. ధరణి పోర్టల్ లో భూ యజమాని వివరాలు నమోదు చేయటానికి వన్ టైం పాస్ వర్డ్ విదాన్నని కూడా ఏర్పాటు చేసారు .
ధరణి పోర్టల్ లో ఉండే సేవలు
భూ బాగా పంపిణి
కొనడం ,అమ్మడం
వారసత్వ భూ బదిలీ
బహుమతి గ వచ్చేవి
కోర్ట్ ఆర్డర్ ద్వారా వచ్చే హక్కులు
భూమి యజమాని ఏం చేయాలి
ధరణి పోర్టల్ లో కొనేవాళ్ళ , అమ్మేవాళ్ళు కు సంబందించిన అన్ని రకాల వివరాలు నింపాలి . ఫ్యామిలీ డీటెయిల్స్, ఆస్తుల డీటెయిల్ నమోదు చేయాలి .
కావలసిన అఫిడవిట్ అప్లోడ్ చేయాలి
వారసత్వ బదిలీ అయినా , భాగాల పంపిణి అయినా కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి
స్టాంప్ డ్యూటీ , రిజిస్ట్రేషన్ ఫీజు ,మ్యుటేషన్ ఛార్జీలకు సంబందించిన చలానా వివరాలు నమోదు చేయాలి
మనం ఏ టైములో రిజిస్ట్రేషన్ కావాలో తెలిపితే తాసిల్దారు కార్యాలయం మెసేజ్ పంపుతుంది .
ఆసమయంలో కొనేవారు ,అమ్మేవారు అలాగే సాక్షి దారులు హాజరు కావలసి ఉంటుంది .
తాసిల్దారు కార్యాలయం ఏం చేస్తుంది
మొదట డేటా ఎంట్రీ ఆపరేటర్ వివరాలు తీసుకోని ధరణిలో పొందుపరుస్తారు .తరువాత వేలి ముద్రలు తీసుకుంటారు .
తాసిల్దారు ,సంయుక్త సబ్ రిజిస్టర్ బయోమెట్రిక్ వివరాలు , చలానా వివరాలు పరిశీలించి రిజిస్ట్రేషన్ చేస్తారు .
సెకండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డీడీస్ ను స్కాన్ చేస్తాడు .తరువాత తాసిల్దారు దస్త్రాలపై డిజిటల్ సంతకం పెడతాడు .దీనితో మ్యుటేషన్ పక్రియ కంప్లీట్ అవుతుంది .
మ్యుటేషన్ పత్రం ,రిజిస్ట్రేషన్ పత్రాలు , అప్డేట్ చేసిన పాస్ పుస్తకం , లావాదేవీల వివరాలు అమ్మిన వారికీ అందిస్తారు .
కొన్న వారికి పాస్ పుస్తకం లేకపోతె ఈ – బుక్ ఇస్తారు . అమ్మిన వారి ఖాతాల నుండి అమ్మిన మేర విస్తీర్ణం తగ్గిస్తారు .
Also Read
అమ్మవారి శరన్నవరాత్రులు ప్రారంభం ..అవతారాలు నైవేద్యాలు – Blessed
vardenafil vs viagra https://vegavardenafil.com/ does canada sell generic vardenafil
how to administer transurethral alprostadil https://alprostadildrugs.com/ alprostadil penile injection
tadalafil generic https://elitadalafill.com/ tadalafil daily use