నటుడు సోనూసూద్ ఎవరికి ఆపద వచ్చిన తన వంతు సాయం చేయడానికి ఎప్పుడు ముందుఉంటాడు . నాలుగు నెలల చిన్నారి ఆపరేషన్ కి డబ్బులు కావలసి రావడంతో సోను స్పందించాడు .

నటుడు సోనూసూద్
డాక్టర్స్ చిన్నారి ఆపరేషన్ కు 8 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పడంతో చిన్నారి తండ్రి స్నేహితులు సాయం కోసం ట్విటర్ లో పోస్ట్ చేసారు . బాలీవుడ్ నటుడు సోనూసూద్ తక్షణం స్పందించి తన మంచి తనాన్ని మరోసారి చాటుకున్నాడు .
కరోనా ఆపద కాడినుండి ఎంతో మందికి సాయం చేసిన సోనూసూద్ మరో చిన్నారి ప్రాణాలు కాపాడాడు . గుండె సమస్య తో బాధపడుతున్న నాలుగు నెలల చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు ముందుకు వచ్చాడు . ఆపరేషన్ కి అయ్యే ఖర్చు సాయం చేస్తానని చెప్పాడు .
రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన పందిపెల్లి బాబు ,రజిత లకు నాలుగు నెలల బాబు అద్విత్ సౌర్య జన్మించాడు . అతడికి గుండె సంబంధిత వ్యాధి ఉంది . ప్రైవేట్ హాస్పత్రిలో పరీక్షలు చేయగా వెంటనే ఆపరేషన్ చేయాలి అన్నారు . దానికి గాను 8 లక్షల ఖర్చు అవుతుంది అని తెలిపారు .
కూలి పనిచేసుకునే ఆ కుటుంబానికి అంత డబ్బు కట్టే స్థోమత లేదు . తెలిసిన వారికీ తమ బాధ వెళ్లబుచ్చుకున్నారు . అతని బాధ ని చూసి గ్రామస్తులు విసయాన్ని ట్విటర్ లో పోస్ట్ చేసారు . ఈ పోస్ట్ చుసిన సోను సూద్ సాయం చేయడానికి ముందుకు వచ్చాడు . హైద్రాబాద్ లోని ఇన్నోవా హాస్పిటల్ లో ఆపరేషన్ చేస్తారని ,దానికి అయ్యే ఖర్చు మేము చూసుకుంటామని ట్వీట్ చేసారు .
బుధవారం నటుడు సోనూసూద్ సిబ్బంది బాధిత కుటుంబానికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు . డాక్టర్ కోన సాంబ శివరావు ఆధ్వర్యంలో ఆపరేషన్ జరుగుతుంది అని సోనూసూద్ చెప్పినట్టు చిన్నారి తండ్రి చెప్పాడు . గ్రామస్థులు కూడా తమ వంతు సాయంగా 40 వేలు ఇచ్చారు . అందుకే సోను సూద్ రియల్ హీరో అని ప్రజలు అంటారు .
Also Read