gtag('config', 'UA-172848801-1');
Home National నరేంద్ర మోడీ పదవిని ఎక్కువకాలం నిర్వహించిన కాంగ్రెస్సేతరమొదటి ప్రధాని

నరేంద్ర మోడీ పదవిని ఎక్కువకాలం నిర్వహించిన కాంగ్రెస్సేతరమొదటి ప్రధాని

నరేంద్ర మోడీ  ప్రధాన మంత్రి  పదవిని ఎక్కువకాలం  నిర్వహించిన కాంగ్రెస్సేతర మొదటి ప్రధానిగా  భారత రాజకీయ చరిత్రలో   నిలిచారు. భారత దేశం మొత్తం ప్రధాన మంత్రులతో పోలిస్తే  సుదీర్ఘ పదవిని నిర్వహించిన నాల్గవ  ప్రధాని నరేంద్ర మోడీ. అటల్ బిహారీ వాజ్‌పేయి మొత్తం 2268 రోజుల వ్యవధి పదవిని చేపడితే ఇప్పుడు  ప్రధాని నరేంద్ర మోడీ దానిని అధిగమించాడు . మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మూడుసార్లు ప్రధాని  పదవి చేపట్టి  మొత్తం 2268 రోజులు ప్రధాని పదవిలో ఉన్నారు. ప్రధానిగా మోడీ మాత్రం రెండోసారి పదవి చేపట్టి వాజ్‌పేయి 2268 రోజులను అధిగమించాడు .

నరేంద్ర మోడీ
CREDIT BY BJP

నరేంద్ర మోడీ 2014  మే 26 న మొదటిసారిగా  దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.2019 లోక్‌సభ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్‌డిఎ మెజారిటీ సాధించిన తరువాత మోడీ  2019 మేలో రెండోసారి ప్రధానిగా ఎన్నిక కబడ్డాడు .  రెండో సారి మెజారిటీ సాధించిన తొలి కాంగ్రెసేతర ప్రధాని మోదీ. ప్రధాని మోడీకి ముందు కాంగ్రెసేతరులు ఎవరు  వరుసగా రెండోసారి  ప్రధాని కాలేదు . ప్రధాని మోడీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పదవీకాలం అధిగమించి  కొత్త రికార్డు సృష్టించారు.

కాంగ్రెసేతర ప్రధానమంత్రుల విషయానికి వస్తే మోడీ, అటల్ బిహారీ వాజ్‌పేయిల తర్వాత మొరార్జీ దేశాయ్ పేరు చెప్పుకోవచ్చు . 1977 లో కాంగ్రెస్‌ను ఘోరంగా ఓడించిన తరువాత  కేంద్రంలో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ విడిపోయి అతని ప్రభుత్వం  రెండున్నర సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే పడిపోయింది . కాంగ్రెసేతర ప్రధానమంత్రులలో  మోడీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, మొరార్జీ దేశాయ్‌లు కాక  విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్, హెచ్‌డి దేవేగౌడ , గుజ్రాల్ ఒక సంవత్సరం పదవి  కాలపరిమితిని పూర్తీ చేసారు .

అయోధ్య ప్రధాని మోడీ రామాలయ భూమిపూజ | ఈ పెద్ద నాయకులకు పిలుపు లేదు

Most Popular

బ్లాక్ ఫంగస్ లక్షణాలు : ఇలా ఉంటె డాక్టర్ సంప్రదించాల్సిందే

బ్లాక్ ఫంగస్ లక్షణాలు: కరోనా తోడు బ్లాక్ ఫంగస్ ముప్పు ఏర్పడబోతోంది . గుజరాత్ లో కన్పించిన ఈ ఫంగస్ తరువాత ఢిల్లీ , మహారాష్ట్ర ఇప్పుడు మన...

N 95 మాస్క్ : ఇది ఎలా వాడాలి..ఎన్నిరోజులు వాడాలి.. డబల్ మాస్క్ మార్గదర్శకాలు

N 95 మాస్క్ : ఈ మాస్క్ లు కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే . అందుకే అందరు ఈ తరహా మాస్క్ లను...

పుట్ట మధు అరెస్ట్ : రామగుండము టాస్క్ ఫోర్స్ అదుపులో తెరాస నేత ,పెద్దపల్లి జడ్పి చైర్మన్- Breaking

పుట్ట మధు అరెస్ట్ : పెద్దపల్లి జడ్పి చైర్మన్, తెరాస నేత అయినా పుట్ట మధు ను పోలీసులు బీమవరంలో అరెస్ట్ చేసారు . అయితే మధును ఎందుకు...

13 రోజులు నిద్రపోతుంది…. ఈమె పడుకుంటే ఆతరువాతే లేస్తుంది- Shocking

13 రోజులు నిద్రపోతుంది…. ఈమె ఒకసారి పడుకుంటే రోజుల తరువాతే నిద్ర లేస్తుంది. ఆమెకు వచ్చిన సమస్య ఏమిటో కుటుంబసభ్యులకు అర్ధం కావటం లేదు . డాక్టర్స్ ఏంచెప్పారంటే...

Recent Comments