నాగబాబు చేస్తున్న కామెడీ షో అదిరింది జీ తెలుగులో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే . ఇప్పుడు అది డబుల్ ఎటెర్టైన్మెంట్ తో
బొమ్మ అదిరిందిగా అధివారంనుండి ప్రసారం కానుంది .

జబర్దస్త్ నుండి నాగబాబు వచ్చిన తరువాత చమ్మక్ చంద్ర , ధన్ రాజ్ ,ఆర్పీ లతో అదిరింది షో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే . అందులో నాగబాబు తో పాటు నవదీప్ జడ్జ్ గా చేసిండు .
సమీరా షరీఫ్ ఈ పోగ్రామ్ కి యాంకర్ గ చేసింది . తరువాత ఆమెను తప్పించి యాంకర్ గా రవిని ,భానుశ్రీ ని తీసుకున్నారు .
ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కొత్త హంగులతో రానుంది .
శ్రీముఖి యాంకర్ గ బొమ్మ అదిరింది పేరుతో సందడి చేయబోతుంది . ఫుల్ గా నవ్వించేందుకు ప్రతి ఆదివారం 9 నుండి 10 గంటల వరకు ప్రసారం కాబోతుంది .
బొమ్మ అదిరింది కార్యక్రమానికి నాగ బాబు తోపాటు జడ్జ్ గా డాన్స్ మాస్టర్ జానీ వ్యవహరించనున్నారు . అయితే ఆదివారం సెలబ్రిటీ యాంకర్ గా సుమ రాబోతుంది . ధన్ రాజ్ ,చమ్మక్ చంద్ర ,వేణులు స్కిట్ తో అలరించారు .