నాగబాబు కూతురు పెళ్లి డేట్ ఫిక్స్ అయింది . నిహారిక ,చైతన్య ల పెళ్లి రోజు ముహూర్తం కుదిరింది . ఆగస్టులో వీరిద్దరి నిశ్చితార్థం హైద్రాబాదులో జరిగిన విషయం తెలిసిందే .

నాగబాబు కూతురు పెళ్లి
మెగా ఫామిలీ అయిన నిహారిక కొణిదెల తో చైతన్య జొన్నగడ్డ పెళ్లి తేదీని ఖరారు చేసారు . వరుడి తండ్రి అయినా ఐజీ జె .ప్రభాకర్ రావు పెళ్లి వివరాలు తెలియచేసారు . డిసెంబర్ 9 వ తేదీ రాత్రి 7. 15 గంటలకు ముహూర్తం పెట్టారు . శ్రీ వారి దర్శనమ్ కోసం వచ్చిన ప్రభాకర్ రావు దంపతులు పెళ్లి పత్రికను శ్రీవారి సేవలో ఉంచి ఆశీర్వాదం తీసుకున్నారు . తరువాత వివాహం ఎక్కడ జరిగేది , ఏ సమయానికి చేసేది ప్రకటించారు . వివాహం రాజస్థాన్ చేస్తున్నారు తెలిపారు . ఆ రాష్ట్రం లోని ఉదయపూర్లో ఉన్న ఉదయ్ విలాస్ లో వివాహం చేస్తున్నారు .
నిశ్చితార్థం కూడా మెగా కుటుంబ సభ్యులు , దగ్గరి సన్నిహితుల మధ్య జరిగింది . ఈ మధ్యనే నిహారిక బ్యాచిలర్ పార్టీ కూడా నిర్వహించింది . నాగబాబు ఇంట్లో పసుపు కొట్టే కార్యం కూడా చేసారు . ఇప్పటికే నిహారిక , చైతన్య ఎంగేజ్మెంట్ ఫోటోలు అందరిని ఆకట్టుకున్నాయి .
చైతన్య విషయానికి వస్తే అతను హైదెరాబాలో పుట్టి పెరిగాడు . భారతీయ విద్య భవన్ జూబ్లీ హిల్స్ బ్రాంచ్ లో స్కూల్ విద్య చేసాడు . ఏంఎస్సీ మాథ్స్ బిట్స్ ఫిలానిలో చేసాడు . ISB లో ఎంబీఏ చదివాడు . చైతన్యకు ఫోటోగ్రఫీ అంటే చాల ఇష్టం
Also Read
గ్యాస్ సిలిండర్ బుకింగ్ : నవంబర్ 1 నుండి కొత్త రూల్స్- Rules