నివర్ తుపాను తీరందాటే సమయంలో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గంటకు 65-85 కి.మీ వేగంతో గాలులు వీచి బారి వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం అయింది .

నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం రాగల 24 గంటల్లో ఇది తీవ్ర తుపానుగా మారనుంది. ఈ తుఫానుకు నివర్ అని నామకరణం చేసారు . ఈ తుఫాన్ తీరం దాటేటప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బలమైన గాలులు వీచి బారి వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం అయింది .
ఐఎండి వివరాల ప్రకారం పుదుచ్చేరికి తూర్పు అఘ్నేయంగా 410 కిలోమీటర్ల దూరంలో ,చెన్నైకి అఘ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమయింది .
తమిళనాడులోని మమాళ్లపురం- కరైకల్ మధ్య ఈ నెల 25న సాయంత్రం తుఫాన్ పుదుచ్చేరి దగ్గరలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది . నివర్ ప్రభావంతో రాయలసీమ,దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది . చిత్తూరు ,నెల్లూరు జిల్లాలో అక్కడ అక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని తెలిపింది . నెల్లూరు జిల్లాకుముందస్తుగా ఎస్డీఆర్ఎఫ్ , ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలను పంపుతున్నట్టు అలాగే జిల్లా అధికారులను , ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేస్తున్నాము అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది . సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు అని , రైతులు అప్రమత్తం గా ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని , తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోని అప్రమత్తంగా ఉండాలని తెలిపినట్టు విపత్తుల శాఖ కమిషనర్ కన్నా బాబు తెలిపారు .
Also Read
Trs Manifesto: గ్రేటర్ ప్రజలకు నీటిబిల్లులు రద్దు … కెసిఆర్ – Gift