నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ టెస్ట్ ను డిసెంబర్ మొదటి వీకెండ్ లో నిర్వహించబోతుంది.డిసెంబర్ 5,6 తేదీలలో ఓటిటి వీక్షకులకు ఉచితంగా అందించబోతుంది .

నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ ఫెస్ట్ నిర్వహిస్తూ ప్రేక్షకులకు ఉచితంగా అందిస్తున్నట్టు నెట్ ఫ్లిక్స్ తెలిపింది . ఓటిటి అభిమానులు భారతీయ భాషలో సినిమాలు ,వెబ్ సిరీస్ లు చూడవచ్చు అని తెలిపింది . ఇప్పటి వరకు సబ్ స్క్రైబ్ చేయని వారుకూడా నెట్ ఫ్లిక్స్ ని ఎంజాయ్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అని తెలిపింది .
భారతీయ మార్కెట్ లో జీ 5, అమెజాన్ ప్రైమ్ ,డిస్నీ హాట్ స్టార్ ఓటిటి లు మంచి ప్రాచుర్యంలో ఉన్నాయి . వాటికీ పోటీగా ఎదగడమే లక్ష్యంగా రెండు రోజులు నెట్ ఫ్లిక్స్ ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తుంది .
భారతీయ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు అద్భుతమైన కథలను అందిస్తున్నాము . డిసెంబర్ 5 రాత్రి 12. 1 గంటలనుండి డిసెంబర్ 6 11. 59 గంటల వరకు స్ట్రీమింగ్ ఫెస్ట్ నిర్వహిస్తున్నాము అని నెట్ ఫ్లిక్స్ ఇండియా తెలిపింది . ఈ స్ట్రీమింగ్ ఫెస్ట్ లో ఉచితంగా చూడాలి అనుకునే వారు పేరు , ఇమెయిల్ లేదా ఫోన్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపింది . ఒకరి లాగిన్ డీటెయిల్స్ మరొకరు ఉపయోగించటానికి వీలులేదు అని తెలిపారు . sd లో వీడియోలు చూడ వచ్చు అని తెలిపింది . నెట్ ఫ్లిక్స్ కు ప్రపంచ వ్యాప్తంగా 195. 15 మిలియన్ల చందాదారులు ఉన్నారు .
Also Read