పవన్ కళ్యాణ్ దీక్ష: ఏపీ లో తుఫాన్ వల్ల నష్టబోయిన రైతులకు న్యాయం చేయాలనీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో తన నివాసంలో ఒక్కరోజు దీక్ష చేపట్టారు .

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన విష్యం తెలిసిందే .అయితే అక్కడ రైతులకు బాగా నష్టం జరిగిందని తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి తక్షణ సాయంగా రూ 10,000,పరిహారంగా 35వేల రూపాయలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో రైతాంగానికి అండగా నిలిచేందుకు రెడీ అయ్యారు . దానికి అనుగుణంగా సోమవారం ఒక్క రోజు దీక్ష చేపట్టారు. హైదరాబాదులోని తన నివాసంలో ఉదయం పదిగంటలకు దీక్షలో కూర్చుని తుఫాన్ బాధితుల రైతాంగానికి మద్దతు తెలిపారు .
నివర్ తుఫాన్ బాధితులను కలిసి వారి బాధలను స్వయంగా తెలుసుకున్న జనసేన అధ్యక్షుడు వాళ్ళకు అండగా ఉంటానని చెప్పాడు . చెప్పినట్టు గానే ప్రభుత్వం స్పందించక పోవడంతో దీక్ష చేపట్టారు .
జీహెచ్ఎంసి కొత్త మేయర్: సిందురెడ్డి కి సీఎం పిలుపు.. పదవి కోసమేనా ? Results