పిజ్జా ఫ్రీ : చిన్నారికి60 ఏళ్ళ పాటు అందించనున్న డొమినోస్- Selected

0
8970
పిజ్జా ఫ్రీ గ ఇస్తానంటే అందరి అనడానికి అవధులు ఉంటాయా . ఎందుకంటె పిజ్జా అంటే యువతరం లొట్టలేస్తుంది. మెల్ బోర్న్ ఒక బాలుడికి మాత్రం 60 సంవత్సరాల పాటు ఉచితంగా పిజ్జాను అందచేస్తున్నది ఒక పిజ్జా సంస్థ . ఇంతకీ ఆ లక్కీ చిన్నారి ఎవరో ఎందుకు ప్రీ గా ఇస్తుందో తెలుసుకుందాం.
పిజ్జా ఫ్రీ

డొమినోస్ ప్రముఖ పిజ్జా సంస్థ . ఆస్ట్రేలియా లో ఈ సంస్థ స్థాపించి డిసెంబర్ 9వ తేదీకి నాటికీ 60 ఏళ్లు పూర్తి అయింది . దీనిని పురస్కరించుకొని వినియోగదారుల కోసం ఆసక్తికరమైన పోటీని పెట్టింది . డిసెంబర్ 9వ తేదీన జన్మించిన చిన్నారి కుటుంబానికి నగదు బహుమతి తో పాటు ఆ చిన్నారికి 60 సంవత్సరాలు ఉచితంగా పిజ్జా పంపిస్తామని తెలియంది .

క్లెమెంటైన్ ఓల్డ్ ఫీల్డ్, ఆంటోనీ లాక్ సిడ్నీకి చెందిన దంపతులు ఈ పోటీలో పాల్గొన్నారు. వీరికి 9వ తేదీ తెల్లవారు జామున 1.47 కు చిన్నారి జన్మించాడు. అతనికి డొమినిక్ అని పేరు పెట్టారు. ఈ పోటీలో డొమినిక్ గెలుపొందినట్లు డొమినోస్ పిజ్జా ప్రకటించింది. డొమినోస్ సంస్థ నుంచి ప్రతి నెలా ఆస్ట్రేలియన్ 14 డాలర్ల విలువైన పిజ్జా, తదితర ఫుడ్ ప్యాకెట్లు 2080 వరకు ఫ్రీ గా పంపిస్తామని తెలిపారు. ఇదే కాకుండా తల్లిదండ్రులకు 10.080 డాలర్ల నగదును కూడా అందిస్తున్నామని డొమినోస్ పిజ్జా తెలిపింది.

బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్..రన్నరప్ అఖిల్..సోహైల్ 25 లక్షలు- Victory