పీఎస్ఎల్వీసీ-51 విజయవంతం : భగవద్గీత ,మోడీ ఫొటోలతో అంతరిక్షంలోకి

0
537
పీఎస్ఎల్వీసీ-51 2021 లో జరిపిన మొదటి అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయింది . శ్రీహరి కోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని చేసింది . మన దేశానికి చెందిన 18 ఉపగ్రహాలతో పాటు , బ్రెజిల్ కి చెందిన ఆమెజానియా 1 అలాగే భగవద్గీత , ప్రధాని ఫోటో ఉన్న ఎస్ డి కార్డు ను పీఎస్ఎల్వీసీ-51 నింగిలోకి తీసుకెళ్లింది .
పీఎస్ఎల్వీసీ-51
COURTASY DD NEWS

ఇస్రో ,ప్రైవేట్ భాగస్వామ్యంతో చేసిన తోలి ప్రయోగం ఇది . ప్రైవేట్ సంస్థలకు చెందిన 5 ఉపగ్రహాలు , విదేశాలకు చెందిన 14 ఉపగ్రహాలను మోసుకెళ్లింది . పీఎస్ఎల్వీ సిరీస్ లో 53 వది . ఇస్రో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరై జెషన్ సెంటర్ తో పాటు ఆమెజానియా , ఎన్ ఎస్ ఐ ఎల్ చెందిన ఉపగ్రహాలు ఉన్నాయి . ఆత్మ నిర్బర్ భారత్ ప్రారంభించినందుకు , అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించినందుకు గౌరవ సూచకంగా ప్రధాని ఫొటో పంపినట్టు ఎస్కె ఐ తెలిపింది .

శాంసంగ్ గెలాక్సీ ఎ12 తక్కువ ధరకే మంచి ఫీచర్స్ తో- Wow