పోకో f2 మోడల్ ఫోన్ త్వరలో విడుదల- Launch

1
87
పోకో f2 మోడల్ ఫోన్ ను దేశీ మార్కెట్లలో ఈ సంవత్సరంలో విడుదల చేస్తున్నట్లు ట్విటర్ లో కంపెనీ పేర్కొంది . గత 2020 లో కంపెనీ సాధించిన విజయాలను వీడియో రూపంలో పోస్ట్ చేస్తూ కంపెనీ పలు అంశాలను ప్రస్తావించింది .
పోకో f2 మోడల్ ఫోన్

పోకో f1 మోడల్ ను 2018 లో విడుదల చేసింది కంపెనీ . ఇప్పుడు 2021 లో దాని స్థానంలో కొత్త ఫ్యూచర్స్ తో పోకో f2 విడుదల చేస్తునట్టు సంస్థ తెలిపింది . దేశీయంగా 10 లక్షలకు పైగా ఆన్లైన్ లో విక్రయించడం ద్వారా స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో టాప్ -5 లో ఉన్నట్టు కంపెనీ తెలిపింది . అయితే పోకో f2 మోడల్ ఫోన్ కి సంబంధించి వివరాలు ఏమి వెల్లడించలేదు .

టెక్ నిపుణుల ప్రకారం పోకో f2 ఫ్యూచర్స్

పోకో f2 క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 732 జీ ప్రాసెసర్ తో విడుదల కానుంది . ఇంతక ముందు 16000 ధరకి విడుదలచేసిన పోకో x3 మోడల్ కి వినియోగించిన ఎస్ ఓ సీతో 4,250 ఎంఎఎచ్ బ్యాటరీ ఉంటుంది . 64 ఎంపీ సెన్సార్ తో క్వాడ్ కెమెరాలు ఉండే అవకాశం ఉంది . అమోలెడ్ డిస్ప్లే కల్గి ఉంటుంది . ఈ ఫ్యూచర్స్ ను బట్టి ఫోన్ ధర 20,000 లు ఆ పైన ఉండే అవకాశం ఉంది .

నూతన సెక్రటేరియట్ భవనం ప్రపంచం అబ్బురపడేలా ఉంటుంది- Amazing

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here