ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ప్రకటించిన అప్పటినుండి సంచలనం రేపుతూనే ఉంది . ఆ సినిమాలో మిగితా నటులు ఎవరు అనేదానిమీద రోజుకో న్యూస్ వస్తూనే ఉంది .

బాహుబలి సినిమా తరువాత అదే స్థాయిలో మిగితా సినిమాలను వరుసగా చేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్ . ప్రపంచ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ తో అంటే స్థాయిలో సినిమాలు నిర్మించటానికి సిద్ధమవుతున్నారు దర్శక ,నిర్మాతలు .
ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ అనే సినిమా తెరకెక్కపోతుంది . బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు . ప్రభాస్ శ్రీ రాముడు పాత్రలో నటిస్తున్నాడు . ప్రభాస్ తగ్గ రేంజ్ లో సీత పాత్రలో ఎవరు నటిస్తారా అని అభిమానులు ఉత్కంఠతగా ఎదురుచూస్తున్నారు .
మొదట కీర్తి సురేష్ అని అటు తరువాత ఊర్వశి రౌటేలా అని ఇప్పుడు కృతి సనన్ అని టాక్ వినిపిస్తుంది . ఎవరిని సీత తీసుకున్నారో అధికారికంగా ప్రకటిస్తే గాని తెలువదు .
ప్రతి నాయకుడు పాత్ర రవాణా సురిడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు మూవీ టీం చెప్పింది . ఇంతకముందు సైఫ్ తానాజీ సినిమాలో ఓం రౌత్ direction లో నటించాడు . ఇప్పుడు ప్రభాస్ కి తమ్ముడు పాత్రలో ఒక యువ నటుడుని లక్ష్మణుడు పాత్రకి ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది . సోను కె టైటు కి స్వీటీ చిత్రంలో నటించిన యువ నటుడు సన్నీ సింగ్ లక్ష్మణుడు పాత్రలో ప్రభాస్ కి తమ్ముడిగా కనిపించనున్నట్టు ప్రచారం జరుగుతుంది .
ఈ సినిమా 2021 మొదట్లో సెట్స్ పైకి వెళ్తుంది అని 2022 ఆగస్టు 11 న సినిమా విడుదల అవుతుందని చిత్ర బృందం తెలిపింది . ఈ సినిమాకోసం 3d గ్రాఫిక్ వాడుతున్నారు . అవతార్ ,స్టార్ వార్స్ సినిమాలకు పనిచేసిన టీం ఈ సినిమాకు పనిచేస్తుంది .
Also Read