ప్రభాస్ యష్ ఇద్దరు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ గా సందడి చేస్తున్నారు . బాహుబలి తో ప్రభాస్ , కేజీఎఫ్ తో యష్ ఆల్ ఇండియాలో మంచి క్రేజ్ ని సంపాదించారు . కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ మొదలుపెట్టాడు . అది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ అనే సినిమా చేస్తునట్టు ప్రకటించాడు .

గతంలో ప్రకటించినట్టు డార్లింగ్ ప్రభాస్ మూవీ సలార్ సినిమాను ఈ రోజు హైద్రాబాద్ లో ఉదయం 11 గంటలకు ప్రారంభించారు . దీనికి ప్రముఖులతో పాటు కేజీఎఫ్ స్టార్ యష్ కూడా వచ్చాడు . దేశంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఇద్దరు స్టార్స్ ఒకే దగర కనపడేసరికి మొత్తం అక్కడ ప్రత్యేక వాతావరణం ఏర్పడింది . ప్రభాస్,యష్ ఒకేచోట కనపడడంతో కెమెరాలు క్లిక్ మనిపించాయి . ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి .
ఇప్పటికి ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా పూర్తి కావొస్తుంది . అలాగే నాగ్ అశ్విన్ , ఆదిపురుష్ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనున్నాయి . ఇప్పుడు ఈ సినిమా ప్రారంభమైయింది . ప్రశాంత్ నీల్ పక్క స్క్రిప్ట్ తో ఉండడంతో కొన్ని నెలల వ్యవధిలోనే సినిమా పూర్తి చేసి అశ్విన్ సినిమా ఆదిపురుష్ సినిమా కంటే ముందు విడుదల అవుతుందని సమాచారం .
కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ జనవరి 16 న ప్రారంభించనున్న ప్రధాని- launch