ప్రాణం తీసిన విండో సీట్: విండో సీట్ కదా గాలి వస్తుంది అని కూర్చున్నాడు . ఎక్కిన కాసేపటికే అచేతనం గా మారాడు . పరిశీలించి చూడగా తలకి గాయం . ఎలా జరిగిందో తెలియక అంబులెన్సు ,పోలిసులకు ఫోన్ .

ప్రజలు ప్రయాణం చేయాలీ అంటే ముందు విండో సీట్ ఉందా అని చూస్తారు . కానీ ఇప్పుడు హైదరాబాద్ లో జరిగిన సంఘటన తో విండో సీట్ లో కూర్చున్నప్పుడు జాగ్రత్త గ ఉండాలి. ఎందుకంటె ప్రమాదం జరిగే అవకాశం ఉంది . తాజాగా సిటీ బస్సులో విండో సీట్ లో కూర్చున్న యువకుడు మృతి చెందాడు .
వివరాలలోకి వెళ్తే పెద్ద పల్లికి చెందిన పవన్ చైతన్య బిటెక్ పూర్తీ చేసాడు . హైద్రాబాద్లో జాబ్ కోసం ట్రైనింగ్ తీసుకునేందుకు వచ్చాడు . ఎస్సార్ నగర్ లోని ఒక హాస్టల్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు . శనివారం ఉదయం ఫ్రెండ్స్ ని కలవటానికి వెళ్ళాడు . తిరిగి హాస్టల్ వెళ్లేందుకు పటాన్ చెరువు – దిలుశుక్ నగర్ బస్సు ఎక్కి విండో సీట్ లో కూర్చున్నాడు .
కోఠిలో మిగితా ప్రయాణికులు ఛైతన్య కదల కుండా ఉండడం చూసి పరిశీలించగా అతడి తలకి గాయాలు అయి తీవ్ర రక్త స్రావం అవుతుంది .బస్సును పక్కకు ఆపి అంబులెన్సు పిలిచి ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్తే , వైద్యులు అప్పటికే మరణించినట్టు తెలిపారు . బస్సులో కూర్చునా వ్యక్తికి ఎలా గాయల తో మరణించాడు అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయగా వారికీ షాకింగ్ విషయం తెలిసింది .
బస్సు డ్రైవర్ వేరే బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ట్రై చేసే క్రమంలో బస్సు బారి గుంతలో పది ఎగరడంతో ఛైతన్య తలా కిటికీ అద్దానికి తగిలి తీవ్ర రక్త స్రావం అయి ప్రాణం తీసిన విండో సీట్ . అతను కూర్చున్న వైపు బస్సు కూడా స్వల్పంగా దెబ్బతినింది . ఫోన్ నంబర్లు ఆధారంగా కుటుంబానికి సమాచారం ఇచ్చి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .