బండి సంజయ్ తెరాస ,ఎంఐఎం లేని హైదరాబాద్ కోసం కృషి చేస్తామని అన్నారు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో అత్యధిక సీట్లలో విజయం సాధించినందుకు బండి సంజయ్ ,ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు కొత్తగా ఎన్నికైన 48 మంది కార్పొరేటర్లు కూడా చార్మినార్ భాగ్యలక్ష్మీఅమ్మవారిని దర్శించుకున్నారు.అమ్మవారి సమక్షంలో పార్టీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి గెలుపొందిన బీజేపీ కార్పొరేటర్లతో ప్రమాణం చేయించారు. అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉంటామని అభివృద్ధికి అన్ని విధాలా కృషిచేస్తామని నూతన కార్పొరేటర్లు ప్రమాణం చేశారు.

బండి సంజయ్ ఎన్నికలకు ముందే జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటామని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం అమ్మవారి దయతో సాధించామన్న ఆయన , శుక్రవారం నూతన కార్పొరేటర్లతో కలిసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్‌కు భాగ్యలక్ష్మీ అమ్మవారి పేరు వల్లే భాగ్యనగరమని పేరొచ్చిందని సంజయ్ అన్నారు.
భాగ్యనగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే అవకాశం ప్రజలు బీజేపీకి ఇచ్చారు. ఇప్పటికి పాతబస్తీ ఎందుకు అభివృద్ధి చెందలేదో ప్రజలు ఆలోచించాలి. పాతబస్తీని అభివృద్ది చేసి చూపుతాం. ఏ మతానికి బీజేపీ వ్యతిరేకం కాదు. హడావిడిగా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించిన కేసీఆర్, మేయర్ ఎన్నిక ఎందుకు నిర్వహించడం లేదో చెప్పాలి. కార్పొరేటర్ల కొనుగోలుకు టీఆర్ఎస్ ప్రయత్నించడానికేనా . మా ఒక్క కార్పొరేటర్‌ను కెలికెతే మేం వంద మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కెలుకుతం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆల్రెడీ మాతో టచ్‌లో ఉన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ గుణపాఠం నేర్చుకోవాలి. బీజేపీ కార్పొరేటర్లతో కలిసి వరదసాయం కోసం పోరాటం చేస్తాం. కేసీఆర్ పొర్లుదండాలు పెట్టినా జైలుకెళ్లడం మాత్రం ఖాయం. సీఎం అనాలోచిత నిర్ణయాల వల్ల రిజిస్ట్రేషన్ వ్యవస్థ నాశనం అయింది అని బండి సంజయ్ అన్నారు .
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆలయాలు నిర్మిస్తున్నామని తెల్సే సోమువీర్రాజు ధర్నా డ్రామాలు
bjp corporator visit baghyalakshmi ammavari temple charminar pic.twitter.com/fqUmpx5RVH
— wakeupTelugu (@WakeupTelugu) December 18, 2020