బీసీసీఐ-ఐపీఎల్ 2020 తో బారిఆదాయం ఆర్జించినట్టు కోశాధికారి అయినా అరుణ్ ధూమల్ వెల్లడించారు . కరోనా వైరస్ ఉన్న కానీ ఐపీఎల్ 2020 లీగ్ ను బీసీసీఐ నిర్వహించి అందరితో సూపర్ అనిపించుకుంది .

బీసీసీఐ-ఐపీఎల్ 2020
ఎప్పుడు వేసవికాలంలో నిర్వహించే ఈ లీగ్ ఇక్కడ ఉన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా యూఏఈ లో నిర్వహించింది బీసీసీఐ . 50 రోజులకు పైగా సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు జరిగాయి . ఐపీఎల్ అంటేనే అభిమానుల కోలాహలం కానీ ఈసారి కరోనా ఉండడంతో ఆ కేరింతలు లేకుండానే జరిగాయి వర్చువల్ పద్దతిలో ఆటగాళ్లకను ప్రేక్షకుల చేత ఉత్సహపరిచారు. ప్రపంచం మొత్తమ్ కరోనా తో సతమతమవుతున్న తరుణంలో ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించడం కష్టం అనుకున్న టైములో కూడా బీసీసీఐ టోర్నీ విజయవంతం చేయడమే కాకుండా మంచి ఆదాయాన్ని ఆర్జించింది అని అరుణ్ ధుమాల్ అన్నారు .
కోశాధికారి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఐపీఎల్ 13 నిర్వహణపై అందరు అనుమానం వ్యక్తం చేసారు . ప్రధాన కార్యదర్శి డైర్యం చేసి ముందుకు వెళ్లారు . చెన్నై జట్టులో కరోనా కేసులు రావడంతో కొంత ఆలోచించాము , ఐసొలేషన్ లో ఉంచి ఎప్పటికప్పుడు ప్రత్యేక బృందాలతో పర్య వేక్షించాము . వాళ్లంతా కోలుకున్నాక టోర్నీ విజయవంతం చేసాము అని అన్నారు . ఈ టోర్నీ లో 35 శాతం ఖర్చులు తాగించుకున్నాము . బీసీసీఐ సుమారు 4000 కోట్లు ఆదాయం ఆర్జించింది . ఈసారి టివి , డిజిటల్ మాధ్యమాల వీక్షకులు సంఖ్య 25 శాతం పెరిగింది అని అన్నారు .
Also Read
నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ ఫెస్ట్ ఉచితంగా ప్రేక్షకులు డిసెంబర్ 5,6 తేదీలలో