gtag('config', 'UA-172848801-1');
Home World బైడెన్ గెలుపు భారత్ కు మేలుగజరుగుతుందా ? Responsible

బైడెన్ గెలుపు భారత్ కు మేలుగజరుగుతుందా ? Responsible

బైడెన్ గెలుపు ప్రపంచం ఉత్కంఠగా ఎన్నికల రోజునుండి ఎదురుచూసింది . విజయం దోబూచులాడింది ఎట్టకేలకు బైడెన్‌ అమెరికా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నాడు .ఇంకా ఓట్ల లెక్కింపు జరుగుతున్నప్పటికీ బిడెన్ ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌ 270ని దాటి 290 ఎలక్టోరల్‌ ఓట్లను సాధించాడు . అధ్యక్షుడిగా గెలిచినా అమెరికా సంప్రదాయం ప్రకారం జనవరి 20న ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు .

బైడెన్ గెలుపు

బైడెన్ గెలుపు

భారత్‌, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత బలపడిన మాట కాదనలేము . ఈమధ్యనే ఇరు దేశాల నేతలు దేశ రక్షణకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇంకోవైపు జో బైడెన్‌ ఎలక్షన్ మేనిఫెస్టో ‌ ప్రకారం భారత్‌- అమెరికా సంబంధాలు ఇంకా బలపడే అవకాశాలు ఉన్నాయి .

రెండు దేశాలూ ఉగ్రవాద నిర్మూలన, వాతావారణ మార్పులు, ఆరోగ్యం, వాణిజ్యం తదితర రంగాల్లో కలిసి ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి. ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్‌లో భారత్‌ను శాశ్వత ప్రతినిధిగా అమెరికా నుండి మద్దత్తు లభించవచ్చు .

బైడెన్‌ ఓ ఇంటర్వ్యూ 2006లో మాట్లాడుతూ 2020 నాటికి ప్రపంచంలో అత్యంత మిత్ర దేశాలుగా భారత్‌, అమెరికా ఉండాలి అని అన్నాడు . అలాగే ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది అని అన్నారు . ఇప్పుడు బైడెన్ అధ్యక్షుడు అయినాడు కాబట్టి ఆదిశగా ఆలోచిస్తాడు అని నిపుణులు అంటున్నారు . బైడెన్‌ బరాక్‌ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉపాధ్యక్షుడి హోదాలో ,అంతర్జాతీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్‌గా చాలా సార్లు అధికారిక చర్చలు చేసారు .

భారత్‌, అమెరికా భాగస్వాము అనేది తన చిరకాల నమ్మకమని బైడెన్‌ చెప్పే అవకాశం ఉంది . బైడెన్ ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టు ఇండియాతో సంబంధాలను బలోపేతం చేయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వవచ్చు . ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలున్న అమెరికా, భారత్ కలసి పనిచేస్తాయి అని డెమొక్రాటిక్‌ పార్టీ తన మానిఫెస్టోలో తెలిపిన విషయం తెలిసిందే . ఇప్పుడు ఉన్న దానికంటే బైడెన్ గెలుపు భారత్‌తో అమెరికా బంధం మరింత బలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.

Also Read

ట్రంప్ కోర్టుకు ఎన్నికల ఫలితాలకోసం వెళితే ఖర్చు ఎంతో తెలుసా ? Cash

4 COMMENTS

Comments are closed.

Most Popular

టోక్యో ఒలింపిక్స్ 2021: పివి సింధు విజయారంభం- Excellent

టోక్యో ఒలింపిక్స్ 2021 : కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడ్డ ఒలింపిక్స్ ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి . మన దేశంకి పతాకం వస్తుంది అని ప్రజలు ఆశించే మన...

Post covid symptoms : కోవిడ్ తగ్గినా తరువాత వచ్చే సమస్యలు ,పాటించవలసిన నియమాలు

Post covid symptoms : కొవిడ్ తగ్గిన తరువాత మనకి వచ్చే సమస్యలు ఏమిటి ,అవి ఎన్ని రోజుల వరకు ఉంటాయి . మనం ఎలాంటి నియమములు పాటించాలి...

అతి భారీ వర్షాలు : 2 రోజులపాటు బారి వర్షాలు … బయటకు రావద్దు వాతావరణ శాఖ

అతి భారీ వర్షాలు : ఎడతెరిపి లేకుండా రెండురోజులుగా వర్షాలు కురుస్తుండడం , వరద నీరు పెరుగుతుండడం, వాగులు , నదులు పెరుగుతుండడంతో అధికారులను , ప్రజా ప్రతినిధులను...

T20 వరల్డ్ కప్ 2021 : భారత్ vs పాక్ … మరో బిగ్ మ్యాచ్

T20 వరల్డ్ కప్ 2021 అక్టోబర్ 17 నుండి ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే . ఈ సారి ఐసీసీ ప్రపంచ కప్ లో మొత్తం నాలుగు గ్రూప్...

Recent Comments