బ్లాక్ ఫంగస్ లక్షణాలు : ఇలా ఉంటె డాక్టర్ సంప్రదించాల్సిందే

0
1205
బ్లాక్ ఫంగస్ లక్షణాలు: కరోనా తోడు బ్లాక్ ఫంగస్ ముప్పు ఏర్పడబోతోంది . గుజరాత్ లో కన్పించిన ఈ ఫంగస్ తరువాత ఢిల్లీ , మహారాష్ట్ర ఇప్పుడు మన తెలంగాణాలో కేసులు నమోదు అవుతున్నాయి . ఇప్పటికే 50 కి పైగా ఈ ఫంగస్ బారిన పడి హైద్రాబాద్ లో చికిత్స పొందుతున్నారు అని సమాచారం . అసలు ఈ బ్లాక్ ఫంగస్ ఏంటి , దాని లక్షణాలు , అది ఎవరికి ఎక్కువగా సోకె అవకాశం ఉందొ చూద్దాం .
బ్లాక్ ఫంగస్ లక్షణాలు


బ్లాక్ ఫంగస్ అనేది వాతావరణంలో ఉండే రక రకాల బాక్టీరియాలు ,ఫంగస్ ఉన్నట్లే యిది ఉంటుంది . సైన్టిఫిక్ మ్యుకర్ మైకోసీస్ అని దీని పిలుస్తారు . ఆరోగ్యం గ ఉన్న వాళ్లకు ఇది అంత ప్రమాదకరం కాదు . కానీ ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వాళ్ళు దీని బారిన పడే అవకాశం ఉంది . కరోనా రోగులకు దానిని తగ్గించేందు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు . అవి ఇమ్యూనిటీ పవర్ ని తగ్గిస్తాయి . దాంతో కరోనా రోగులకు ఇ బ్లాక్ ఫంగస్ ఎట్టాక్ అయ్యే అవకాశం ఉంది . షుగర్ ఉండి కరోనా బారిన పడిన వారికీ కూడా దీని ముప్పు అధికంగా ఉంది .

బ్లాక్ ఫంగస్ లక్షణాలు

కంటి దగ్గర నొప్పి , కంటి రెప్పల వాపు , విపరీతమైన తలనొప్పి , చూపు మందగించడం మొదలగు సమస్యలు ఉంటె వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి .
కరోనా తగ్గిన వాళ్ళకే కాకుండా , చికిత్స పొందే వారికీ కూడా ఇ బ్లాక్ ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంది . కరోనా తగ్గినా నెలరోజుల వరకు జాగ్రత్తగా ఉండాలి . నెలరోజుల తరువాత ఫంగస్ సోకె అవకాశాలు చాల తక్కువ . ఇది తొందరగా గుర్తిస్తే ఏమీకాదు , ఆలస్యం అయితే ప్రాణాలకు ప్రమాదం . ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకునే ప్రయత్నం చేయాలి .

స్వీటీ అనుష్క పెళ్లి … వయసులో చిన్నవాడైన వ్యాపారవేత్త తో త్వరలో? Happy

Stay Safe….Stay Home