gtag('config', 'UA-172848801-1');
Home Technology భారతదేశంలో వివో వి 19 ధర ఇప్పుడు 4000 rs తగ్గింపు

భారతదేశంలో వివో వి 19 ధర ఇప్పుడు 4000 rs తగ్గింపు

  భారతదేశంలో వివో వి 19  ధర ఇప్పుడు ప్రారంభ ధర రూ .24,900 నుండి ప్రారంభమవుతుంది.  8 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ఫోన్ యొక్క కొత్త ధర ఇది.  8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లను రూ .27,990 ధరకు లభిస్తుంది .

భారతదేశంలో వివో వి 19
credit score by vivo

వివో వి 19 భారతదేశంలో కేవలం రెండు నెలల ముందే  లాంచ్ అయింది, ఇప్పుడు దాని ధర తగ్గించబడింది. వివో వి 19 లో ర్యామ్ మరియు స్టోరేజ్ ఆధారంగా రెండు వేరియంట్లు ఉన్నాయి – 8 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ మరియు 8 జిబి ర్యామ్ + 256 జిబి స్టోరేజ్. 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ .3వేలు తగ్గించగా, 256 జీబీ మోడల్ ధర రూ .4 వేలు తగ్గింది. ఈ ఫోన్ యొక్క ముఖ్యమైన లక్షణాల గురించి చూసుకుంటే  వివో వి 19 హ్యాండ్‌సెట్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్,స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, డ్యూయల్ సెల్ఫీ కెమెరా సెటప్ ను కలిగి వుంది .

భారతదేశంలో vivo v-19 ధరలు

వివో వి 19 ధర భారతదేశంలో  ఇప్పుడు రూ .24,900 నుండి ప్రారంభమవుతుంది. ఈ  ఫోన్  యొక్క రెండు వేరియంట్ల పాత ధర వరుసగా రూ .27,990 మరియు రూ .31,990 అని తెలిసిందే .2400రు    ఫోన్ యొక్క 8 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ వేరియంట్ యొక్క కొత్త ధర ఇది.  8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ .27,990 .  

 ఇ-కామర్స్ సైట్ అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త ధరలో లభిస్తుంది. వివో వి 19 పియానో ​​బ్లాక్ మరియు మిస్టిక్ సిల్వర్ రంగులలో అందుబాటులో ఉంది.

vivo v-19 ఫ్యూచర్స్

డ్యూయల్ సిమ్ (నానో) తో వివో వి 19 – 6.44-అంగుళాల పూర్తి-హెచ్‌డి + (1080×2400 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. డిస్ప్లే రక్షణకు   దీనికి 6TH జనరేషన్   కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఇవ్వబడింది . ఫోన్‌లో డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు  చీకటిలో అదనపు రక్షణ కోసం తక్కువ ప్రకాశాన్ని ఇచ్చే యాంటీ-ఫ్లికర్ సాంకేతికత అందించబడింది. ఆండ్రాయిడ్ 10 ఆధారంగా ఫోన్ ఫన్‌టచ్ ఓఎస్ 10 లో నడుస్తుంది. వివో వి 19 లో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్‌తో 8 జిబి ర్యామ్ ఉంది.

ఈ బిడ్డను వదిలేయండి అన్న వాళ్లకు విజయంతో బుద్ధి చెప్పిన ఆర్తి డోగ్రా

కెమెరా ఫ్యూచర్స్

 వివో వి 19 వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది, ఇది ఫోన్ ఎగువ ఎడమ మూలలో ఎల్-ఆకారంలో సెట్ చేయబడింది. ఈ సెటప్‌లో 48 మెగాపిక్సెల్ ప్రాధమిక సెన్సార్ ఉంది, ఇది ఎఫ్ / 1.79 ఆపర్చర్‌తో ఉంటుంది . ఇది కాకుండా, ఎఫ్ / 2.2 ఆపర్చర్‌తో 8మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా మరియు ఎఫ్ / 2.4 ఆపర్చర్‌తో రెండు 2 మెగాపిక్సెల్ మాక్రో మరియు ఎఫ్ / 2.4 ఆపర్చరు సెన్సార్లు ఉన్నాయి. మెయిన్  కెమెరాలో  సూపర్ నైట్ మోడ్, అల్ట్రా-స్టేబుల్ వీడియో, ఆర్ట్ పోర్ట్రెయిట్ వీడియో, సూపర్ మాక్రో మరియు బోకె పోర్ట్రెయిట్ ఉన్నాయి.

ఫోన్  ముందు ప్యానెల్‌లో  పిల్ ఆకారం రంధ్రం-పంచ్ ఇవ్వబడింది. ఇందులో 32 మెగాపిక్సెల్ ప్రైమరీ సెల్ఫీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెల్ఫీ కెమెరా ఉంటాయి  . ఫ్రంట్ కెమెరా ఫీచర్లలో సూపర్ నైట్ సెల్ఫీ, సూపర్ వైడ్-యాంగిల్ సెల్ఫీ, అల్ట్రా స్టేబుల్ వీడియో మొదలైనవి ఉన్నాయి.

వివో వి 19 లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది మరియు 33 వాట్ వివో ఫాస్ట్ ‌చార్జ్ 2.0 ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ ఫ్యూచర్ లో  యుఎస్బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ 5.0, 2.4 గిగాహెర్ట్జ్ మరియు 5 గిగాహెర్ట్జ్ డ్యూయల్ బ్యాండ్ వై-ఫై మరియు జిపిఎస్ సపోర్ట్ ఉన్నాయి. ఇవి కాకుండా, సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్ మరియు గైరోస్కోప్ ఉన్నాయి.

7 COMMENTS

Comments are closed.

Most Popular

టోక్యో ఒలింపిక్స్ 2021: పివి సింధు విజయారంభం- Excellent

టోక్యో ఒలింపిక్స్ 2021 : కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడ్డ ఒలింపిక్స్ ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి . మన దేశంకి పతాకం వస్తుంది అని ప్రజలు ఆశించే మన...

Post covid symptoms : కోవిడ్ తగ్గినా తరువాత వచ్చే సమస్యలు ,పాటించవలసిన నియమాలు

Post covid symptoms : కొవిడ్ తగ్గిన తరువాత మనకి వచ్చే సమస్యలు ఏమిటి ,అవి ఎన్ని రోజుల వరకు ఉంటాయి . మనం ఎలాంటి నియమములు పాటించాలి...

అతి భారీ వర్షాలు : 2 రోజులపాటు బారి వర్షాలు … బయటకు రావద్దు వాతావరణ శాఖ

అతి భారీ వర్షాలు : ఎడతెరిపి లేకుండా రెండురోజులుగా వర్షాలు కురుస్తుండడం , వరద నీరు పెరుగుతుండడం, వాగులు , నదులు పెరుగుతుండడంతో అధికారులను , ప్రజా ప్రతినిధులను...

T20 వరల్డ్ కప్ 2021 : భారత్ vs పాక్ … మరో బిగ్ మ్యాచ్

T20 వరల్డ్ కప్ 2021 అక్టోబర్ 17 నుండి ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే . ఈ సారి ఐసీసీ ప్రపంచ కప్ లో మొత్తం నాలుగు గ్రూప్...

Recent Comments