భారత్‌-చైనా సరిహద్దు వివాదం : పార్లమెంట్లో రక్షణ మంత్రి ప్రకటన

0
688

భారత్‌-చైనా సరిహద్దు సమస్య అలానే వుంది అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. రెండు దేశాల సరిహద్దుల్లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని సమస్య అలానే ఉందని ఇంకా పరిష్కారం కాలేదని స్పష్టం చేశారు.

మన దేశ బలగాలు భారత గౌరవాన్ని పెంచుతున్నాయని , చైనా దూకుడుకు చెక్‌ పెడుతూ భారత దళాలు అప్రమత్తంగా ,సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. చైనా చాల మొండిగా ప్రవర్తిస్తుంది , ఈ ఏడాది మే నుంచి సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరిస్తూ వస్తుందని అన్నారు

చైనాతో మనం ఎప్పుడు స్నేహ సంబంధాలనే కోరుకుంటున్నా డ్రాగన్‌ దూకుడుగా వ్యవహరించడంతో శాంతి ఒప్పందంపై ప్రభావం పడుతోందని, ద్వైపాక్షిక చర్చలపైనా ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పారు. భారత్‌-చైనాతో సరిహద్దు వివాదం

ఇప్పటిది కాదు ,ఎప్పటినుంచో వివాదం అపరిష్కృతంగా ఉంది , 1962లో లడ్డాఖ్‌లో చైనా 90 వేల కిలోమీటర్ల భూభాగం ఆక్రమించిందని అన్నారు. మనం దేశ రక్షణ విషయంలో రాజీ పడేది లేదని రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేస్తున్నామని అన్నారు . రెండు దేశాల సరిహద్దుల నిర్ణయానికి చైనా అంగీకరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు రక్షణ మంత్రి .
ఇరు దేశాలు ఎల్‌ఏసీని గౌరవించాలని అన్నారు.
చైనా చేస్తున్న ఏకపక్ష చర్యలను భారత్‌ ఖండిస్తోందని, డ్రాగన్‌ కదలికలను ఎప్పటికి అప్పుడు గమనిస్తున్నామని మన సైన్యం కూడా అలెర్ట్ గా ఉందని రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు.

ఏపీలో వైఎస్సార్ బీమా – లబ్ధిదారుల ఎంపిక ప్రారంభం