జూలై 24 నాటికి భూమికి సమీపంగా భారీ సైజులో వున్నా గ్రహశకలం ‘ఆస్టరాయిడ్ 2020 ఎన్డీ రానుందని నాసా వెల్లడించింది .ఇదే కాక ఇంకో రెండు గ్రహశకలాలు కూడా వస్తున్నాయని తెలియచేసింది .

ఎప్పటినుండో అనేకసార్లు గ్రహశకలాలు మన గ్రహానికి సమీపంగా వచ్చిన భూమండలానికి ప్రమాదం ఏమి జరగలేదు. ఇప్పుడు వస్తున్నా ‘ఆస్టరాయిడ్ 2020 ఎన్డీ’ చాల వేగంతో మన గ్రాహం వైపు
వస్తుందని ఇంతకుముందు గ్రహశకలాల్లా దీన్ని తేలిగ్గా తీసుకోవద్దని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ అంటుంది.
దీని సైజు , వేగం , భూమి దిశగా కదులుతున్న తీరు ఆందోళన కలిగిస్తోందని ‘నాసా’ తెలిపింది.దీని వ్యాసం వచ్చి 130-280m అలాగే ప్రయాణ వేగం వచ్చి 13.5 కిలోమీటర్ పర్ సెకండ్. జూలై 24 నాటికి భూమికి సమీపంగా వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. ఇంకా ఇ సంవత్సరంలో ‘2016 డీవై 30’, ‘2020 ఎంఈ3’ అనే మరో రెండు గ్రహశకలాలు కూడా భూమికి దగ్గరగా వస్తున్నాయని నాసా ప్రకటించింది .