gtag('config', 'UA-172848801-1');
Home TELUGU STATES విద్యుత్ పొదుపు చేయడంలో ప్రజల్లో చైతన్యం రావాలి మంత్రి జగదీష్ రెడ్డి- Responsible

విద్యుత్ పొదుపు చేయడంలో ప్రజల్లో చైతన్యం రావాలి మంత్రి జగదీష్ రెడ్డి- Responsible

జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ప్రారంభోత్సవంలో మంత్రి జగదీష్ రెడ్డి జుమ్ మీటింగ్ లో కార్యక్రమంలో పాల్గొన్నారు . విద్యుత్ ను పొదుపు చెయ్యడం లో ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. తద్వారా ఆర్థిక వెసులుబాటు తో పాటు పర్యావరణ పరిరక్షణ సులబతరమౌతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మంత్రి జగదీష్ రెడ్డి

సోమవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర రేనబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఆయన జూమ్ ద్వారా ప్రారంభించారు. అదే విదంగా ఆ సంస్థ రూపొందించిన సావనిర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూమ్ ద్వారా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు థర్మల్ విద్యుత్ మీద ఆధారపడిన ప్రపంచం ఇప్పుడిప్పుడే సాంప్రదెయతర విద్యుత్ వైపు చూస్తున్నారన్నారు.అందులో తెలంగాణా రాష్ట్రము ఇప్పటికే ముందున్నదని ఆయన స్పష్టం చేశారు. అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో చాలా ముందు ఉన్నారన్నారు.ఉద్యమ కాలం లోనే విద్యుత్ పొదుపు గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే హితబోదను మంత్రి జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ప్రస్తుతం ప్రపంచ దేశాల ముందు ఉన్న ఛాలెంజ్ విద్యుత్ పొదుపు అని అందుకు అనుసరించాల్సిన పద్ధతులను ప్రజల్లోకి ఉద్యమంలా తీసుకు పోవాలని ఆయన కోరారు.2014 కు ముందు మొక్కలు నాటడం అంటే అటవీశాఖ కు మాత్రమే పరిమితం అయి ఉండేది .ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం మొక్కలు నాటడం సామాజిక బాధ్యత గా మార్చారని ఆయన గుర్తుచేశారు.అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పడ్డ శ్రమ అని ఆయన కొనియాడారు.
విద్యుత్ వినియోగం మానవ జీవితంలో భాగమైందని అటువంటి విద్యుత్ వాడకంలో పొదుపు పాటిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే విద్యుత్ పొదుపు విషయంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, రెడ్కో వంటి సంస్థ లు చొరవ చూపి పని చేస్తున్నాయని ఇది ప్రజా ఉద్యమంలా ముందుకు పోతే లక్ష్యసిద్ధి సుసాధ్యం కష్ట తరం కాబోదు అన్నారు.ఐ ఇ ఐ చైర్మన్ రామేశ్వర్ రావు కో ఆర్డినెట్ చేసిన ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధన శాఖా కార్యదర్శి సందీప్ సుల్తానీయ,రెడ్కో చైర్మన్ ఎన్ జానయ్య ,ఎనర్జీ కనసర్వేషన్ చైర్మన్ ఇ. శ్రీనివాస చారి,కన్వీనర్ సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి: ఇప్పటి దాకా సంక్షేమం చూశారు..ఇక అభివృద్ధిని చూస్తారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy

బ్లాక్ టీ మన దేశంలో ప్రజలు ఇపుడిప్పుడే కొంచెం ఎక్కువ మంది త్రాగడం మొదలు పెట్టారు . టీ అనేది మన లైఫ్ లో రెగ్యులర్ డ్రింక్ ....

లక్షన్నర టిప్ 10 వేళా బిల్లుకు అంతఇచ్చాడు- Awesome

లక్షన్నర టిప్ సర్వ్ చేసిన వ్యక్తికి ఇచ్చాడు అంటే ఎంతో పెద్ద పంక్షన్ చేసి కోటి రూపాయిల బిల్లు అయితే అనుకోవచ్చు . కానీ ఇక్కడ ఆవ్యక్తి కి...

శాంసంగ్ గెలాక్సీ ఎ12 తక్కువ ధరకే మంచి ఫీచర్స్ తో- Wow

శాంసంగ్ గెలాక్సీ ఎ12 అనే స్మార్ట్ ఫోన్ ను శాంసంగ్ కంపెనీ మంగళవారం బారతీయ మార్కెట్ లో విడుదల చేసింది . అది వినియోగదారులను ఆకర్షించేలా తక్కువ ధరతో...

రామ్ లింగు సామి తో పాన్ ఇండియా మూవీ- Launch

రామ్ లింగు సామి తో సినిమా చేయబోతున్నాడు . ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ వరుసగా మూడు హిట్లతో మంచి ఊపు మీద ఉన్నాడు . రామ్...

Recent Comments