మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి: ఇప్పటి దాకా సంక్షేమం చూశారు..ఇక అభివృద్ధిని చూస్తారు

0
670
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జాయింట్ కలెక్టర్ సహా జిల్లా అధికార యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహించారు . రాబోయే మూడేళ్లూ కనీ విని యెరుగనంత అభివృద్ధి జరుగుతుంది అని ,ఆత్మకూరు నియోజకవర్గంలో పారిశ్రామికరంగానికి సంబంధించి త్వరలో మరో శుభవార్త ఉంటుంది అని ,ఒక్క రైతు కూడా నష్టపోని విధంగా నివర్ పరిహారం ఇస్తామని అన్నారు .
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

మంత్రి మేకపాటి సమీక్ష తుపాను వల్ల కలిగిన కష్ట, నష్టాల అంచనాలపై సమీక్ష నిర్వహించారు . దేశంలోనే 22 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఒక్కటే,నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి తన పిల్లలని ప్రభుత్వ బడిలో చేర్పించడమే ప్రభుత్వ పనితీరుకు ఒక ఉదాహరణ అని అన్నారు .

గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన సచివాలయాలు, ఆర్ బీకేలు, జనతా బజార్లు, బడులు, ఆస్పత్రుల నాడు-నేడు సహా అన్ని మర్చి కల్లా పూర్తి చేయాలి . తుపాను వంటి విపత్తుల సమయంలో ఇంత త్వరగా గతంలో ఏ ప్రభుత్వం స్పందించలేదు,ఈ స్థాయి వేగంగా ఎన్నడూ అంచనాలు వేసి నివేదిక ఇవ్వలేదు అని మేకపాటి అన్నారు.కార్పొరేట్ స్థాయికి తగ్గని విధంగా సకల సదుపాయాలతో ప్రభుత్వ బడులు, ఆస్పత్రులు అలాగే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వేగంగా గ్రామాల అభివృద్ధి చేస్తుంది అని అన్నారు .

కరోనా సమయంలో కష్టాలొచ్చినా అధిగమించాం, కాస్త ఆలస్యమైనా 90శాతం పనులు పూర్తి చేశాం. పేదలందరికీ పాఠశాల, ఆస్పత్రుల విషయంలో కార్పొరేట్ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాము .మద్దతు ధర సహా రైతుల విషయంలో సీఎం ముందు చూపు వల్లే పంజాబ్ పరిస్థితి ఏపీలో లేదు. సరికొత్త హంగులు, అత్యాధునిక సదుపాయాలతో పోర్టులు, ఎయిర్ పోర్టులు, జాతీయ రహదారులు, పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి జరిగాయి అన్నారు .

ఈడీబీ నిధుల ద్వారా విశాఖ, చెన్నై కారిడార్లు కూడా త్వరగా అభివృద్ధి,ఆత్మకూరు నియోజకవర్గంలో పారిశ్రామిక, ఎమ్ఎస్ఎమ్ఈలకు సంబంధించి మరింత అభివృద్ధి చేస్తుంది ప్రభుత్వం అని మంత్రి అన్నారు . అంగన్ వాడీ పాఠశాలలో నియామకమైన మహిళలకు ఆర్డీవో కార్యాలయంలో నియామక పత్రాలు అందచేశారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

“జగనన్న జీవ క్రాంతి” పథకం ప్రారంభించనున్న సీఎం జగన్- Launch