మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆలయాలు నిర్మిస్తున్నామని తెల్సే సోమువీర్రాజు ధర్నా డ్రామాలు

0
1255

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఆలయాలు కూల్చినప్పుడు దేవాదాయ శాఖ మంత్రి ఎవరు? ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రభుత్వంలో లేనప్పుడు ఒకలా వీర్రాజు వ్యవహరించడం సరికాదు. ఆలయాలు నిర్మిస్తున్నామని తెల్సే సోమువీర్రాజు ధర్నా డ్రామాలు చేస్తున్నాడు అని అన్నారు .

మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాస్

కూల్చిన దేవాలయాలు నిర్మించాలని నిర్ణయించాం. ఆ క్రెడిట్‌ శ్రీ జగన్ గారికి దక్కుతుందని ఈ వేషాలు వేస్తున్నారు . బీజేపీకి చెందిన మాణిక్యాలరావు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఆలయాలు కూల్చారు. అప్పుడు మీరు నోరెందుకు విప్పలేదు?దేవాలయాల కూల్చివేత నిరసనగా బంద్‌కు పిలుపు ఇస్తే.. బీజేపీకి సంబంధంలేదంటూ ప్రకటన ఇచ్చారా? లేదా? అని మంత్రి ప్రశ్నించారు

గతంలో దేవాలయాలు కూల్చితే ధర్నా చేస్తే బీజేపీ సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ డ్రామాలేంటి? కోట్ల విలువైన దుర్గగుడి భూముల్ని సిద్దార్థ కాలేజీకి కారు చౌకగా ఇస్తే ఆనాడు బీజేపీ ఎందుకు ప్రశ్నించలేదు?సీఎం శ్రీ జగన్ రూ.70 కోట్లతో దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది బీజేపీకి కనిపించలేదా?గోవులకు నీడ కల్పించేవాళ్లమే కానీ గోవులకు నీడ తీసిన వాళ్లం కాదు. హిందూ మతాన్ని ఆచరిస్తాను.. ఇతర మతాలను గౌరవిస్తాను అని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు .

గత రెండు మూడు రోజులు నుంచి బీజేపీ పగటి కలలు కంటూ ధర్నాలు, డ్రామాలు చేస్తోందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, విఘ్ణ ఇతర పెద్ద, చోటా నాయకులు అంతా రాష్ట్ర ప్రభుత్వం మీద, దేవాదాయ శాఖమంత్రి అయిన నా మీద విమర్శలు చేస్తున్నారు. ఈరోజు కూల్చిన దేవాలయాలు పునర్‌ నిర్మించాలని బీజేపీ ధర్నా చేసింది. మరి, ఆ అలయాలు ఎవరి హయాంలో కూల్చారు? ఆరోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఎవరున్నారు? టీడీపీ వారు కేంద్రమంత్రులుగా మీ ప్రభుత్వంలో లేరా? మీరు టీడీపీలో భాగస్వామిగా లేరా? ఆ రోజు ఆలయాలు దేవాలయాలు కూల్చినప్పుడు బీజేపీ నేతలు ఎందుకు బయటకు రాలేదు? అని వెల్లంపల్లి నిలదీశారు.

పుష్కరాలకు అవసరం లేకపోయినా పుష్కరాల పేరుతో దేవాలయాల్ని అరాచకంగా, అన్యాయంగా కూల్చిన దుర్మార్గులు మీరు కాదా అని సోమువీర్రాజును ప్రశ్నిస్తున్నానని వెల్లంపల్లి అడిగారు. ఆరోజు సోమువీర్రాజు ఎందుకు మాట్లాడలేదు. ఈరోజున బీజేపీ నేతలు అంతా సర్జికల్ స్ట్రైక్స్ అని మాట్లాడుతున్నారు. మరి ఆనాడు ఎందుకు మాట్లాడలేకపోయారు. ఆరోజున నేను కూడా బీజేపీలో ఉన్నా. ఈ దేవాలయాలు ఘటనప్పుడు భీమవరం పార్టీ మీటింగ్ నుంచి పరిగెత్తుకొని విజయవాడ వచ్చాను. దేవాలయాల కూల్చివేతను అడ్డుకుంటూ నేను బంద్‌కు పిలుపు ఇస్తే.. పార్టీకి సంబంధం లేదని వ్యక్తిగతంగా ఇచ్చిన స్టేట్‌మెంట్ అని బీజేపీ చెప్పింది అవునా? కాదా? అని సోమువీర్రాజును వెల్లంపల్లి ప్రశ్నించారు.

ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రభుత్వంలో లేనప్పుడు ఒకలా బీజేపీ వ్యవహరించడం సరికాదు. ఈరోజు పడగొట్టిన దేవాలయాల గురించి మాట్లాడటానికి కారణం ఏంటి అంటే.. ఆ దేవాలయాలను పునర్‌ నిర్మించటానికి అక్టోబర్‌లోనే అనుమతులు ఇచ్చి ఇవాళ జీఓ జారీ చేయటం జరిగిందని వెల్లంపల్లి వెల్లండించారు. ఈ విషయం తెల్సుకొని ఆలయాలు ఎక్కడ నిర్మిస్తారో ఎక్కడ వైయస్‌ఆర్‌సీపీకి పేరు వస్తుందో అని ఈరోజు కేవలం రాజకీయ డ్రామా చేయటానికే సోమువీర్రాజు ధర్నా చేశారు. ఎంత వరకు సమంజసం ఇదని వెల్లంపల్లి అన్నారు.

విద్యుత్ పొదుపు చేయడంలో ప్రజల్లో చైతన్యం రావాలి మంత్రి జగదీష్ రెడ్డి- Responsible