మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కేంద్ర వ్యవసాయ చట్టాలు ప్రమాదకరం- Useless

0
847
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలెన్నుకుంటేనే కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కేంద్రం బాధ్యతలు వదిలేసి ఆరోపణలు చేస్తుంది. కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చేది అది రాష్ట్రానికి రావాల్సిన వాటా మాత్రమే ,వారు అది దానం ల బావిస్తున్నారు అని అన్నారు .
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

బూర్గంపహాడ్ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ విధమైన వాక్యాలు చేసారు . కేంద్రానికి రాష్ట్రం నుండి పోయింది రూ.2.72 లక్షల కోట్లు అయితే వాళ్ళు తిరిగి ఇచ్చింది మాత్రం రూ.లక్షా 40 వేల కోట్లు మాత్రమే .మరి ఎవరి డబ్బులు ఎవరికి ఇచ్చినట్లు ? ఎవరు తీసుకుపోయినట్లు ? అర్ధం కాకా ఉన్నది .

తెలంగాణ వచ్చిన తరువాత గోదాంల సామర్థ్యాన్ని 60 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచుకున్నాం. కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలు రైతుల జీవితాలను కార్పొరేట్ కంపెనీలకు పన్నంగా పెట్టేవిల ఉన్నాయి .అందుకే లక్షల మంది రైతులు ఢిల్లీని ముట్టడించి ఉద్యమం చేస్తున్నారు.కొత్త చట్టాలలో కనీస మద్దతుధరకు కేంద్రం తిలోదకాలు ఇచ్చింది. భారత వ్యవసాయ ఆహారరంగాన్ని కార్పోరేట్లకు తాకట్టు పెట్టడమే కేంద్ర ప్రభుత్వ చట్టాల ఉద్దేశంలాగా కనిపిస్తుంది . వివిధ సంస్థలు, రంగాలను పథకం ప్రకారం కుంటుపరిచి కేంద్రం ప్రైవేటుపరం చేయాలనీ చూస్తుంది అని అన్నారు .

కేవలం పంజాబ్, హర్యానలోనే ఉద్యమం ఉంది అని అంటున్నారు
తెలంగాణ ఉద్యమం పుట్టి దావానలంలా వ్యాపించింది .కేంద్రం మేలుకోకుంటే రైతు ఉద్యమంలో పడి కొట్టుకుపోతారు. హరీందర్ పాల్ అనే శాస్త్రవేత్త కేంద్రమంత్రి పురస్కారాన్ని వేదిక మీదనే తిరస్కరించారు. అనేకమంది పద్మశ్రీలు, ఖేల్ రత్నలు తిరస్కరిస్తున్నారు.కేంద్రం వెంటనే వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలి. పౌరులకు ఆహారభద్రత, రైతులకు వ్యవసాయ భద్రత కోసం కనీస మద్దతు ధరను ఏర్పాటు చేశారు. కేంద్రం తీరు మారకుంటే ఈ దేశ రైతులు భవిష్యత్ ఇచ్చే తీర్పులో తమ నిర్ణయాన్ని వెల్లడిస్తారు.

రైతువేదికలతో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు . రైతువేదికలంటే కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు. సుధీర్ఘలక్ష్యంతో రైతాంగ శ్రేయస్సు కోసం ఏర్పాటు చేస్తున్నవి. రైతు నమ్ముకున్న వ్యవసాయం లాభసాటి చేయాలన్న ఉద్దేశంతో నిర్మిస్తున్నవి. 60 శాతం మంది ఉపాధిగా కొనసాగుతున్న రంగం వ్యవసాయం. అందుకే ఈ రంగాన్ని బలోపేతం చేయడం మీద కేసీఅర్ గారు దృష్టిసారించారు అని అన్నారు .

జలవనరులను సద్వినియోగం చేసుకుంటేనే తెలంగాణ. మంచినీళ్లు దొరకని తెలంగాణ లో భూగర్భజలాలు ఎగిసిపడే స్థితిని కేసీఅర్ గారు తీసుకొచ్చారు నష్టమొచ్చినా రైతుకు లబ్ది చేకూరాలని వంద శాతం పంటలు మద్దతు ధరకు కొన్నది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే. నియంత్రిత సాగుతో రైతు లాభపడాలన్న లక్ష్యంతో మొదటి అడుగువేశాం. దురదృష్టవశాత్తు గత యాభైఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదై పంటలు దెబ్బతిన్నాయి.

పంట నష్టంపై అంచనా వేసి రూ.5 వేల కోట్ల నష్టం జరిగిందని కేంద్రానికి పంపిస్తే నయాపైసా సాయం చేయలేదు అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు .ఈ కార్యక్రమములో ఇంకా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఎమ్మెల్యే రేగా కాంతారావు గారు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య గారు తదితరులు పాల్గొన్నారు .

విజయశాంతి :కేసీఆర్ నాకంటే పెద్ద నటుడు- Fired