మన పేరుమీద ఫోన్ నంబర్స్ ఎన్ని ఉన్నాయో ఇలా తెలుసుకోండి

0
3477
మన పేరుమీద ఫోన్ నంబర్స్ ఎన్ని ఉన్నాయో అనేది చాల మంది పట్టించుకోరు . చాల మంది ఫోన్ నంబర్స్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నంబర్స్ వాడుతుంటారు . ఒకరికి మాములుగా 9 నంబర్స్ తీసుకునే వీలు ఉంది . కానీ కొంత మంది పేర్ల మీద 9 కంటే ఎక్కువ ఫోన్ నంబర్లు ఉన్నటు గుర్తించామని విజయ వాడ టెలికం డిప్యూటీ డైరెక్టర్ తెలిపారు .
మన పేరుమీద ఫోన్ నంబర్స్

ఇప్పుడు మనకు స్మార్ట్ ఫోన్ లు వివిధ రకాలుగా అందుబాటులో ఉండడం ,అలాగే డ్యూయల్ సిం వాడే అవకాశం ఉండడంతో చాల మంది రెండు నంబర్లు వాడుతున్నారు . కొంత మంది రెండు మొబైల్స్ వాడే వారు 4 నంబర్స్ వరకు వాడే అవకాశ ఉంది . బిసినెస్ చేసేవారు 5 నుండి 6 నంబర్స్ వరకు వాడవచ్చు . మనకి మనం వాడే నంబర్లు కన్నా ఎక్కువ ఫోన్ నంబర్స్ మన పేరుమీద ఉన్నాయి అనే అనుమానం కలిగితే , మన పేరుమీద ఫోన్ నంబర్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవచ్చు అంటున్నారు టెలికామ్ శాఖ వారు .

మనం మన పేరు మీద ఉన్న నంబర్స్ తెలుసుకోవడానికి విజయవాడ టెలికామ్ శాఖ ఒక కొత్త వెబ్ సైట్ ను ప్రారంభించింది . ఆ వెబ్ సైట్ లింక్

http ://tafcop.dgtelecom.gov.in లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి , దానికి వచ్చిన ఓటీపీ నమోదు చేయగానే మన పేరు మీద ఉన్న నంబర్స్ డిస్ప్లే అవుతాయి . వాటిలో మనకు తెలీకుండా ఉండే నంబర్లు సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే టెలికామ్ శాఖ ఆయా నంబర్స్ ఫై చర్యలు తీసుకుంటుంది .

సోనూసూద్ టెస్టెడ్ పాజిటివ్ : రియల్ హీరోకి కరోనా- Stable