ముక్కు అవినాష్ పెళ్లి : ఎంగేజ్ మెంట్ చేసుకున్న బిగ్ బాస్ అవినాష్- Wow

0
773
ముక్కు అవినాష్ పెళ్లి : జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ అందరికి సుపరిచితమే . బిగ్ బాస్ 4 లో మంచి కామెడీ తో ప్రక్షకులందరిని అలరించాడు . అవినాష్ ,అరియనా జోడి షో లో ఎట్రాక్షన్ గా నిలిచింది . షో నడిచిన రోజులు వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉండనై అనుకున్నారు . బయటికి వచ్చిన తరువాత పెళ్లికూడా చేసుకుంటారు అనుకున్నారు అంత . కానీ ఇప్పుడు అవినాష్ వేరే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ అవడంతో ఎవరా అమమయి అని అందరు ఆరా తీస్తున్నారు .
ముక్కు అవినాష్ పెళ్లి

జబర్దస్త్ , బిగ్ బాస్ , అలాగే ఇప్పుడు బుల్లితెర ప్రోగ్రాం లలో దూసుకు పోతున్న అవినాష్ పెళ్లి ఫిక్స్ అయింది . అవినాష్ ఎంగేజ్ మెంట్ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు . ” సరైన వ్యక్తి మీ జీవితంలో వచ్చినప్పుడు ఆలస్యం చేయద్దు . మా కుటుంబాలు కలుసుకున్నాయి . తరువాత మేము కలుసుకున్నాము . చాల సార్లు చాల మంది నా పెళ్లి గురించి అడిగారు . అతి త్వరలోనే అనుజా తో నాపెళ్ళి . ఇది న నిశ్చితార్థం . ఎప్పటిలాగే మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్ చేసాడు .

ఇక ముక్కు అవినాష్ పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలియగానే ఆ అమ్మాయి ఎవరు అని సెర్చ్ మొదలు అయింది . తెలిసిన సమాచారం ప్రకారం అమ్మాయి పేరు అనుజా వాకిటి . అవినాష్ సామజిక వర్గానికి చెందిన అమ్మాయే . ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి . మొత్తానికి ప్రేమ పెళ్లి చేసుకుంటాడు అనుకుంటే చివరికి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటున్నాడు అన్నమాట .

Tandoori Tea : మంచి దమ్ చాయ్ ..హైదరాబాద్ స్ట్రీట్ టీ