మొదటి కరోనా టీకా ను ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశాఖ స్వీపర్ పుష్పకుమారి కి వేశారు . హైదరాబాద్ లో మొదటి టీకాను సఫాయి కర్మచారి ఎస్ కృష్ణమ్మ కు వేశారు . వనాస్థిలిపురం ఏరియా ఆసుపత్రిలో మస్తాన్ బి వేయించుకున్నారు . హైదరాబాద్ ఒస్మానియా ఆసుపత్రిలో సూపరిండెంట్ నరేందర్ తీసుకున్నారు .

కరోనా మహమ్మారిని నిర్ములించే దానిలో భాగంగా ఈరోజు దేశ వ్యాప్తంగా ప్రధాని చేతులమీదుగా కరోనా టీకా ప్రారంభించారు . తెలుగు రాష్ట్రాలలో కూడా అన్ని ఏర్పాట్ల మధ్య టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు . జిజిహెచ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహ రెడ్డి లాంఛనం గా ప్రారంభించారు .
కరోనా వాక్సిన్ ను మొదట నేను తీసుకోలేదు . ప్రాణాలకు తెగించి పోరాడిన డాక్టర్స్ కు ,నర్సులకు ,శానిటైజర్ సిబ్బందికి మొదట ఇవ్వలిసిన అవసరం ఉంది అని ఉద్వేగానికి లోనయ్యారు మంత్రి ఈటెల రాజేందర్ . రెండు రాష్ట్రాలలో సజావుగా సాగేలా ఏర్పాట్లు చేసారు . టీకా తీసుకున్న వారికీ ఏమైనా సమస్యలు వచ్చిన ప్రత్యేకంగా ఆసుపత్రులు సిద్ధంచేసి ఉంచారు .

ప్రభాస్ యష్ ఒకే ఫ్రేములో…సలార్ మూవీ ప్రారంభం – Launch
Corona vaccine at Hyderabad#vaccine #CoronaVaccine #LargestVaccineDrive pic.twitter.com/UhxrURa9UW
— wakeupTelugu (@WakeupTelugu) January 16, 2021