మ్యాగీ పిజ్జా ఇంట్లోనే చాల సింపుల్ గా అది ఒవేన్ లేకుండా రుచికరంగా చేసుకోవచ్చు . అతి తక్కువ సమయంలోనే మనం పిజ్జా చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు . దానిని ఎలా చేసుకోవాలో ఏం ఏం కావాలో చూద్దామా .
మ్యాగీ అంటేనే పిల్లలకు ,పెద్దలకు కూడా ఇష్టమైనదే. పిల్లలు ఎప్పుడు ఆకలి అయినా మమ్మి మ్యాగీ కావాలి అని మారం చేస్తారు . బ్యాచ్లర్స్ కూడా ఎక్కువ ఇదే చేసుకుంటారు . అలాగే అందరికి మరో ఇష్టమైన స్నాక్ పిజ్జా . ఇప్పుడు మనం మాగీ తో పిజ్జా చేసేద్దాం .
మ్యాగీ పిజ్జా కి కావలసిన ఐటమ్స్
2మ్యాగీ పాకెట్స్
2 మ్యాగీ మసాలా
4 స్పూన్స్ మొక్క జొన్న పిండి
4 స్పూన్స్ రెడ్ చిల్లి సాస్
4 స్పూన్స్ టమాటో సాస్
2 చీజ్ స్లైసెస్
చిన్న కప్పు ఉల్లిపాయలు
చిన్న కప్పు టొమాటోలు
మొదట మనం మ్యాగీ ని ఎలా చేస్తామో అలాగే నీరు వేడి చేసి అది మెగా గానే నూడుల్స్ వేసికొంచెం ఉడికిన తరువాత మ్యాగీ మసాలా వేసి కలపాలి . నీరు మొత్తం ఇంకి దింపే ముందు మొక్క జొన్న పిండి వేసి బాగా కలిసె లా కలపాలి .ఇక్కడ చాలా మంది మైదా పిండి వాడుతారు కానీ మనం మొక్క జొన్న పిండి తీసుకున్నాం . తరువాత దానిని దింపి వేరే పాన్ పెట్టుకోవాలి .
ఆ పాన్ లో నెయ్యి కానీ బట్టర్ కానీ వేసుకోవాలి తరువాత మనం ఉడికించిన నూడుల్స్ వేసుకోవాలి . నూడుల్స్ ని మంచి రౌండ్ షేప్ లో అనే బేస్ మాదిరి చేసుకోవాలి . మంచిగా కాలేదాకా అంటే 5MIN ఉడికించుకోవాలి . తరువాత దానిని తిప్పి ఇంకోవైపు వేసుకోవాలి .
వెంటనే దాని పైన రెడ్ చిల్లి సాస్ , అలాగే టమాటో సాస్ ఒక దాని తరువాత ఒకటి అప్లై చేయాలి . తరువాత చీజ్ వేయాలి . ఇప్పుడు ఉల్లిపాయలు తరువాత టమాటో ముక్కలు వేసుకోవాలి . 15MIN లిడ్ పెట్టి ఉడికించుకోవాలి . క్రింది భాగం మంచిగా కాలటంతో పాటు చీజ్ కూడా కరిగి మంచి ఫ్లేవర్ వస్తుంది .
ఫైనల్ గా కట్ చేసుకొని సాస్ పెట్టుకొని తింటే దాని రుచే వేరు . మీరు కూడా ఇది పిల్లకు కానీ ,ఎవరైనా ఇంటికి వచ్చి నప్పుడు స్నాక్ లగ్గా చేస్తే బాగుటుంది . రెసిపీ మీకు నచ్చితే కామెంట్ చేయండి .
Also Read