రథసప్తమి 2021 ఈనెల 19 న జరుపుకోబోతున్నాము . దీనిని సూర్యా జయంతి అనికూడా అంటాము . ప్రతి నెల సూర్యుడు ఒక రాశి నుండి ఇంకో రాశికి ప్రయాణిస్తూ ఉంటాడు . అప్పుడు సూర్యుడి ఒక తేజస్సు తో అయొక్క రాశికి శుభ పరిణామాలను ఇవ్వడం జరుగుతుంది . ఉత్తరాయణ పుణ్యకాలములో వచ్చేది రథ సప్తమి . ఉత్తరాయణములో తామసిక గుణాలు తగ్గి డైవ గుణాలు పెరుగుతాయి .

సూర్యుడు ప్రతినెలా ఒకొక్క రాశిలోకి ప్రవేశిస్తున్నప్పుడు మనకు ఆయన నెలలో ఒకొక్క రకం కూరగాయలు లభిస్తూ ఉంటాయి . అందుకే మనం రధసప్తమి రోజు చిక్కుడు కాయలతో రథం చేస్తూ ఉంటారు . ఈ చిక్కుడు కాయ యాంటీ బాడీ లాగా ,మంచి ప్రోటీన్స్ ఇస్తుంది . మన ఋషులు అన్ని తెలుసుకొని కొన్ని పద్ధతులు వేల సంవత్సరాల ముందే కనుగొన్నారు .
రథ సప్తమి రోజు సూర్యోదయం ముందు లేచి స్నానం జిల్లేడాకులు ఒకటి తలమీద ,రెండు బుజాల మీద పెట్టుకొని చేయాలి . అలాగే సూర్య సహస్త్ర నామములు తప్పకుండ వినాలి . ఆదిత్య హృదయం చదవడం కానీ వినడం కానీ చేయాలి . దగ్గరలోని సూర్య దేవాలయం వెళ్ళాలి .
మన పురాణాలు 18 – వాటి ప్రత్యేకతలు.. Epic
రథ సప్తమి గురుంచి క్లుప్తంగా తెలుసుకోవాలి అంటే ఈ క్రింది వీడియో చూడగలరు