రష్మిక మందన : నేను పెళ్లి చేసుకునేవాడు ఎలా ఉండాలి అంటే

0
596
రష్మిక మందన సినిమా లలోనే కాదు సోషల్ మీడియా లో కూడా హవా నడిపిస్తుంది . కన్నడ రంగంలో అడుగుపెట్టిన ఈ భామ కెరియర్ మొదలుపెట్టిన మొదట్లోనే టాలీ వుడ్ లో ఛాన్స్ కొట్టేసింది . ఇపుడు హిందీలో కూడా రెండు సినిమాలు చేస్తుంది .
రష్మిక మందన

తెలుగులో మొదట ‘చలో ‘ సినిమాలో నటించి హిట్ అవడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది . తరువాత మన రౌడీ విజయ దేవరకొండ గీతా గోవిడంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది . ఇప్పుడు రష్మిక బాలీవుడ్ లో అడుగు పెట్టింది . అక్కడ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది . హిందీలో ‘మిషన్ మజ్ను’ తో పాటు ‘గుడ్ భాయ్’ అనే సినిమాలో అమితాబ్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు .

సినిమాలలో ఎంత బిజీ ఉన్న సోషల్ మీడియాలో కూడా చాల యాక్టీవ్ గా ఉంటుంది . ఈమె పెట్టె పోస్ట్లు , వీడియో లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాయి . హిందీ సినిమా షూటింగ్ గాప్ లో సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసింది . అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది . ఒక నెటిజన్ మీకు స్మోకింగ్ అలవాటు ఉందా అని అడిగితే మందాన నాకు అలవాటు లేదు , త్రాగేవారు ప్రక్కన నిలబడిన అసహ్యం వేస్తుంది అని సంధానం ఇచ్చింది .
ఇంకొక అభిమాని మిమల్ని పెళ్లి చేసుకోవాలి అంటే ఆ అబ్బాయికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి అని అడగగా దానికి రష్మిక ‘ మంచి వ్యక్తిత్వం కలిగి ఎలాంటి ఆర్భాటాలు , హంగులు లేని సాధారణ వ్యక్తి లాగా ఉండాలి అం చెప్పింది . ఇంకొక నెటిజన్ నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే ప్రపోసల్ మంచిగా చేయచ్చుగా అని బుంగ మూతి పెట్టింది . మొత్తానికి రష్మిక మందన తనకు ఎలాంటి వాడు కావాలో చెప్పడం తో అభిమానులు ఎవరు కరెక్ట్ అని ఆలోచనలోపడ్డారు .

బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు : రానాదగ్గుబాటి హోస్ట్?ప్రారంభ తేదీ ఫిక్స్