రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య రియల్ ఇన్సిడెంట్ ఏది జరిగిన ఆ స్టోరీ మీద సినిమా నిర్మిస్తున్నాడు . సినిమాలు అయితే నిర్మిస్తున్నాడు అవి హిట్ అయిన దాఖలు లేవు . సినిమా ప్రకటిస్తున్నాడు నెలలో సినిమా రీలీజ్ చేస్తున్నాడు .
రామ్ గోపాల్ వర్మ

దిశ సంఘటన ఆధారంగా సినిమా
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన దిశ సంఘటన ఆధారంగా సినిమా నిర్మిస్తాను అని ప్రకటించాడు . సంఘటన జరిగిన ప్రాంతాలను సందర్శించాడు .అలాగే దానికి సంబందించిన అన్ని విషయాలలో ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు .
ఈ మధ్య మీడియా పరంగా హై లైట్ అవుతున్నాడు కానీ సినిమాలు మాత్రం ప్లాప్ అవుతున్నాయి . వర్మ ఏంటి ఇలా అయిపోయాడు అనే స్టేజ్ లోకి వెళ్ళిపోయాడు .
ఆనంద్ చంద్ర డైరెక్షన్ లో ఆర్జీవీ ప్రొడక్షన్ మీద దిశా ఎన్కౌంటర్ సినిమా ట్రైలర్ రీలీజ్ చేసాడు . ట్రైలర్ లో అమ్మాయిని నలుగురు వ్యక్తులు ఎలా కిడ్నప్ చేసి హత్యాచారం చేసి హత్య చేసారో చూపించాడు .
ఈ ఘటన లో పాల్గొన్న నలుగురిని పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే .ట్రైలర్ అయితే బాగానే ఉంది . తేరా పైకి వస్తే ఎలాఉంటుందో చూడాలి . ఎందుకంటె వర్మ డిజిటల్ మీడియాలో వచ్చినంత హైప్ తేర మీద సినిమాలో కనపడడం లేదు . ఈ సినిమా అన్న హిట్ అవుతుంది అని కోరుకుందాం .
కేబుల్ బ్రిడ్జ్ హైదరాబాద్ మరో మణిహారం-MIND BLOWING