రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2020లో ఈసారి టైటిల్ కొట్టాలి అని అభిమానులు కోరుకుంటున్నారు .
ఐపీఎల్ లో మూడు సార్లు ఫైనల్ కి వచ్చికూడా రాయల్ చాలెంజర్స్ కప్ గెలుపొందలేక పోయింది. కానీ ఎప్పుడు ఐపీఎల్ జరిగిన బెంగళూరు హాట్ ఫేవరేట్ గానే చూస్తారు అభిమానులు . ఎందుకంటె ఆ టీం మెంబెర్ కెప్టెన్ విరాట్ కోహిలి ఉండడమే కారణం . విరాట్ కోహిలి క్రీజ్ లో ఉనంత సేపు టీం గెలిపించే సత్తా ఉన్నోడుకూడా . షెడ్యూల్ ఎక్కువ అవుతుంది కొంత రెస్ట్ కావాలి అని కోహిలి గతంలో కోరడం జరిగింది . ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా చాల సమయం దొరికింది . ఇంకా ఇప్పుడు డబల్ ఎనర్జీ తో వున్నాడు . ఎలాగయినా టైటిల్ కొట్టాలి అనే పట్టుదల తో ఉన్నాడు .
ఈసారి పించ్ ఆస్ట్రేలియా జట్టు లో చేరడం టీం బ్యాటింగ్ లో బాగా బలం చేకూరినట్టే . ఆల్రెడీ మ్యాచ్ విన్నెర్స్ ఏ బి డివిలియర్స్ ,కోహిలి వున్నారు . బెంగళూరు టీం లో అల్ రౌండర్స్ ఎక్కువగా వున్నారు . అందుకే బ్యాటింగ్ పరంగా చాల స్ట్రాంగ్ గ ఉన్నారు . అదే వారి బలం కూడా . బౌలింగ్ మాత్రం కొంచెం వీక్ అనే చెప్పుకోవచ్చు . చాల వరకు గత ఐపీఎల్ మ్యాచ్ లలో బౌలింగ్ వల్లే ఓడిపోయినా సందర్భాలు చాల ఉన్నాయి , స్టైన్ ,మోరిస్ ,ఉమేష్ యాదవ్ మంచి బౌలర్లు ఉన్నారు కానీ ,చివరి 10 ఓవర్లు రన్స్ ని ఆపలేక పోతున్నారు . చాహల్ ఉన్నాకూడా ఎఫెక్టివ్ అనిపించడంలేదు . ఈసారి మోరిస్ వచ్చాడు కాబ్బటి బౌలింగ్ మెరుగుపడితే గెలుపు అవకాశాలు మెరుగు పడతాయి . ఈసారి యువ ప్లేయర్స్ ని తీసుకున్నారు వాళ్లకి అవకాశాలు ఇచ్చి టీం ని బ్యాటింగ్లో ,బౌలింగ్లో పటిష్టము చేస్తే ఐపీఎల్ 2020 టైటిల్ కొట్టాలి అనే కోహిలి కల నెరవేరే అవకాశం చాలా ఉంది .