రియల్ హీరో సోనూసూద్ మరో ఘనత సాధించాడు- Capable

0
7912
రియల్ హీరో సోనూసూద్ మరో అరుదయిన గౌరవం దక్కించుకున్నాడు .యూకే లోని ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో టాప్ 50 లో చోటు సంపాదించుకున్నాడు . ఆసియా లోని ప్రముఖులలో కూడా స్థానం సంపాదించాడు .
రియల్ హీరో సోనూసూద్
రియల్ హీరో సోనూసూద్

ప్రతి సంవత్సరం ఏడాదిలో మంచి పనులు చేసిన వారు , మంచి పేరు తెచ్చుకున్నవారు , తమ శక్తి ని మించి అందరికి సహాయం చేసిన వారికీ సంబంధించి యూకే లోని ఒక సంస్థ సర్వే నిర్వహించింది . ఆ సంస్థ తయారు చేసిన టాప్ 50 లిస్టులో సోనూసూద్ కూడా స్థానం సంపాదించుకున్నాడు .

కరోనా లాక్ డౌన్ కాలంలో చాల మంది పనులు లేక , ఊర్లు వెళ్లలేక రోడ్లపై ఉండడం చుసిన సోనూసూద్ చలించిపోయాడు . వలస కూలీలకు ప్రత్యేకంగా సొంత ఖర్చులతో రవాణా ఏర్పాటు చేసి వారి వారి ఇండ్లకు పంపించాడు . విదేశాలలో ఉన్న వారు ప్రాధేయ పడడంతో స్పెషల్ ఫ్లైట్ వేసి ఇండియాకు రప్పించాడు . అలాగే సోషల్ మీడియాలో తనకు సహాయం కావాలని అడిగిన వారికీ అందరి సహాయం చేస్తూ వచ్చాడు .

ఇదే విషయమై సోను మాట్లాడుతూ కరోనా నాకు ఇతరుల గురించి ఆలోచించేలా చేసింది . న తోటి దేశ ప్రజలకు సేవ చేయడం కర్తవ్యంగా భావించాను . ఈ న ప్రయత్నం శ్వాస ఉన్నత వరకు ఆపను అని అన్నాడు .
ఈ సేవల కారణంగా ఈ ఏడాది సోనూసూద్ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం తో పాటు రియల్ హీరో అనిపించుకున్నాడు . పంజాబ్ ప్రభుత్వం రాష్ట్ర యూత్ ఐకానిక్ గ నియమిచ్చింది . యూకే సంస్థ నిర్వహించిన సర్వేలో రియల్ హీరో సోనూసూద్ మరో ఘనత సాధించాడు .

మందు బాబులకు ఝలక్ .. వ్యాక్సిన్‌ వేసుకుంటే2 నెలలు తాగుడు బంద్!no