రూ 1.12కోట్ల లంచం | పట్టుబడ్డ మెదక్ అదనపు కలెక్టర్

0
680
రూ 1.12కోట్ల

రూ1.12కోట్ల లంచం వ్యవహారం లో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ జి .నగేష్ పట్టుబడ్డాడు . ఇటీవలే కీసర కీస‌ర తహశీల్దార్ లంచం కేసు సంచలనం సృష్టించడం , ప్రభుత్వం కొత్త చట్టం రూపకల్పనలో ఉండడగానే మరో ఘటన వెలుగులోకి రావడం విశేషం . అనిషా అధికారులు సోదాల్లో ఒప్పంద పత్రం దొరికింది . దానిలో 112 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ కోసం noc ఇవ్వడానికి 40 లక్షల తోపాటు , అదనపు కలెక్టర్ బినామీ పేరిట 5 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని వుంది . నగేష్ ఇంట్లో ,సంబధీకుల ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి . విచారణ సమయంలో నగేష్ అస్వస్థత గురవడంతో వైద్యుడిని రప్పించి చికిత్స చేసారు .

g nagesh
file photograph

గడ్డం నగేష్ డి నిజామాబాదు జిల్లా బాల్కొండ మండలానికి చెందిన వెల్కటూరు . నిర్మల్ ,కామారెడ్డి ఆర్ డి ఓ గ పనిచేసి 2018 లో మెదక్ అదనపు కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు . ఆర్ డి ఓ గ ఉన్నపుడుకూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి . ఈ వ్యవహారంలో అదనపు కలెక్టర్ తో పాటు మరో 5 గురిని అరెస్ట్ చేసారు . బాదితుడితో అదనపు కలెక్టర్ సంభాషణల ఆడియో కూడా అనిషా అధికారులు కలెక్ట్ చేసుకున్నారు .

రూ1.12కోట్ల లంచం వ్యవహారం లో గడ్డం నగేష్ బినామీ జీవన్ గౌడ్ నిర్మల్ జిల్లా మామడకు చెందినవాడు . నగేష్ నిర్మల్లో డి ఆర్ ఓ గ పనిచేస్తున్నప్పుడు పరిచయం అయ్యాడు . భూముల వివాదాలలో మధ్య వర్తిత్వం వహించి వాటిని పరిష్కరించే క్రమంలో నగేష్ నమ్మకాన్ని చురగొన్నాడు . అప్పటినుండి నగేష్ అవినీతిలో బినామీగా వుంటూ వస్తున్నాడు .

రైల్ జనరల్, స్లీపర్ కోచ్ లు ఏసీ కోచ్ లుగా ఆధునీకరణ – ఇండియన్ రైల్వే