రెహానే టీం రికార్డ్ 32 ఏళ్ళ తరువాత ఆస్ట్రేలియాలో సిరీస్ కైవసం- Great

0
1415
రెహానే టీం రికార్డ్ విజయం నయా చరిత్ర సృష్టించింది . గబ్బాలో భారత్ గడగడ లాడించి ఆస్ట్రేలియా పై చరిత్ర సృష్టించింది. పంత్ పోరాటంతో సిరీస్ కైవసం చేసుకొని 32 యేండ్ల లో ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించింది . బోర్డర్ – గవాస్కర్ సిరీస్ ను 2-1 తో కైవసం చేసుకుంది .
రెహానే టీం రికార్డ్
COURTASY FOX SPORTS NEWS

కరోనా నిబంధలు మధ్య ఆస్ట్రేలియా సిరీస్ వెళ్లిన భారత్ మొదటి మ్యాచ్ గోరంగా ఓడిపోవడంతో అంత ఈ సిరీస్ మోత ఇలానే ఉంటుందేమో అనుకున్నారు . కానీ రెండో మ్యాచ్ గెలిచి మల్లి అందరిలో ఒక ఉత్సహాన్ని నింపారు . మూడో మ్యాచ్ లో మల్లి ఓటమి అంచులదాకా వెళ్లారు . విహారి ,అశ్విన్ జట్టును ఆదుకొని డ్రా గా ముగించారు . సీనియర్ బౌలర్లు గాయాల పాలవడం తో ఆ బాధ్యత కొత్త కుర్రాళ్లు తీసుకున్నారు .
నటరాజ్ , సిరాజ్ ,సైనీ , వాషింగ్టన్ సుందర్ మంచి బౌలింగ్ చేసి బారి స్కోర్ చేయకుండా ఆస్ట్రేలియాను కట్టడి చేసారు .

బ్యాటింగ్ కూడా సమిష్టిగా ఆస్ట్రేలియా ఉంచిన లక్ష్యాన్ని సాధించి విజయాన్ని అందించారు . ఈ విజయంతో టెస్ట్ ఛాంపియన్ షిప్ లో కూడా అగ్రస్థానంలోకి వెళ్ళింది . మొదటి స్థానంలో ఉన్న న్యూజిలాండ్ ను వెకకు నెట్టి భారత్ అగ్రస్థానం దక్కించుకుంది . ఈ చారిత్రక విజయాన్ని అందించిన భారత జట్టుకు మన ముఖ్యమంత్రి కేసీర్ అభినందించారు . ప్రధాని మోడీ కూడా ప్రశంసల జల్లు కురిపించారు . బీసీసీఐ జట్టుకి 5 కోట్ల నజరానా ప్రకటించింది .

ప్రభాస్ యష్ ఒకే ఫ్రేములో…సలార్ మూవీ ప్రారంభం – Launch