రేవంత్ రెడ్డి vs ఎంపి కోమటిరెడ్డి : ఫ్రెండ్స్ మధ్య దూరం ఇప్పట్లో తగ్గదా ? Competitive

0
2436
రేవంత్ రెడ్డి vs ఎంపి కోమటిరెడ్డి : పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ,ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ . రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక కోమటిరెడ్డి,రేవంత్ మద్య గ్యాప్ పెరిగింది. ఈ గ్యాప్ రేవంత్ పదవి చేపట్టినప్పటి నుండి కొనసాగుతూనే ఉంది. కొంత కలం తరువాత అంత సద్దు మునుగుతుంది అనుకుంటే , కోమటిరెడ్డి వైఎస్ సంస్మరణ సభకి హాజరవడం తో కాంగ్రెస్‌లో చర్చ మొదలయింది .కొందరు టీపీసీసీని ధిక్కారించారని అంటుంటే, ఇంకొందరు అది తప్పు కాదు అంటున్నారు . అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఏమి జరుగుతుందో ఒకసారి చూద్దాం
రేవంత్ రెడ్డి vs ఎంపి కోమటిరెడ్డి

పీసీసీ పదవి ఆశించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.ప్రతి రోజు ఏదో ఒక విషయంలో సందర్భంలో రేవంత్ రెడ్డి vs ఎంపి కోమటిరెడ్డి అన్నట్టుగామాటలు నడుస్తూనే ఉన్నాయి . కోమటిరెడ్డి వ్యవహారంపై రేవంత్ రెడ్డివర్గం గుర్రు గా ఉంన్నారు . రేవంత్ రెడ్డి విషయంలో సీనియర్ నేతలంతా సైలెంట్ అయిపోయి ఎవరి పని వారు చేసుకుంటున్నారు . కానీ కోమటిరెడ్డి మాత్రం పిసిసి ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తు రేవంత్ రెడ్డి కి తలనొప్పిగా మారడు

పిసిసి పదవి ఆశించి దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైనా కోమటిరెడ్డి .పీసీసీ పదవి అమ్ముడు పోయిందని సంచలన వాఖ్యాలు చేసిన విషయం తెలిసిందే . అప్పటి నుండి అవకాశం దొరికినప్పుడల్లా రేవంత్ రెడ్డి వర్గం పై ఏదో ఒక విధంగా విమర్శిస్తూనే ఉన్నారు . కాంగ్రెస్ పార్టీని టీడీపీ కాంగ్రెస్ గా మార్చేశారని స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు . విషయం హైకమాండ్ దగ్గరికి వెళ్లేసరికి రంగంలోకి దిగి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుజ్జగించినట్లు తెలిసింది . దాంతో సైలెంట్‌ గా ఉంటూ వచ్చిన కోమటిరెడ్డి మళ్లీ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు స్టార్ట్ చేసాడు .

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ లో వైఎస్సంస్మరణ సభ రచ్చగా మారింది . పార్టీ ఆదేశాలను ధిక్కరించి వైఎస్ఆర్ సంస్మరణ సభకు కోమటిరెడ్డి వెళ్లడాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం . పార్టీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ సభకు వెళ్లడం పార్టీని ధిక్కరించినట్లేనని కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు

కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ చనిపోయిన వైఎస్ సభకు వెళితే తప్పేంటని కోమటిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. మూడు రోజుల ముందు ఆహ్వానం అందితే , రెండు గంటల ముందు వైఎస్ఆర్ సంస్మరణ సభకు వెళ్లొద్దని పార్టీ ఆదేశించడం ఎంతవరకు కరెక్ట్ అని అన్నారు . కాంగ్రెస్ పార్టీలో తాను చిన్నపిల్లాడిని కాదని తనపై డిక్టేటర్ షిప్ చేయద్దు అని కోమటిరెడ్డి అన్నారు .

కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మధుయాష్కి మాట్లాడుతూ అవసరం అనుకుంటే కోమటిరెడ్డి పార్టీని విడిచి వెళ్లిపోవచ్చని అంతేగాని ఇలాంటి పనులతో పీసీసీ పరువు తీయవద్దని అన్నారు . మధుయాష్కీ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించిన కోమటిరెడ్డి తనకు తానుగా పార్టీ వదలమని పంపిస్తే వెళ్లిపోయేందుకు సిద్ధమే అని అన్నారు . అయితే సీనియర్ నాయకులూ మాత్రం కోమటిరెడ్డికి సపోర్ట్ గా మాట్లాడారు . త్వరలో అంత సమసిపోతుంది అని వారన్నారు . చూడాలి రేవంత్ రెడ్డి ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తాడో .

ఏపి కేబినెట్ డెడ్ లైన్ : రెండున్నరేళ్లు పూర్తవుతుండడంతో మంత్రులలో గుబులు- Tense