gtag('config', 'UA-172848801-1');
Home National రైతుల పంటలు కొనడంలో కేంద్ర ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి...మంత్రి నిరంజన్ రెడ్డి

రైతుల పంటలు కొనడంలో కేంద్ర ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి…మంత్రి నిరంజన్ రెడ్డి

రైతుల పంటలు కొనడంలో కేంద్రం రాద్దాంతం ఎందుకు చేస్తుంది అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు .కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రాలు రైతులకు మద్దతుధరకు మించి ఇస్తే అభినందించాల్సింది పోయి అడ్డుపుల్లలు ఎందుకు వేస్తున్నారు అని ప్రశ్నించారు .
రైతుల పంటలు కొనడం

రైతుల పంటలు కొనడంలో కేంద్ర ఇచ్చిన ఉత్తర్వులు అసమంజసంగా ఉన్నాయి అని మంత్రి అన్నారు . వరి ధాన్యం సేకరణలో కేంద్రం ఎఫ్ సీ ఐ ద్వారా రాష్ట్రాలకు ఇచ్చిన ఉత్తర్వులలో మద్దతుధరకు మించి ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా రైతులకు బోనస్/ అదనపు ధర ఇవ్వకుండా ఉత్తరువులు ఇవ్వడం కరెక్ట్ కాదని అన్నారు .

పత్తి సేకరణ విషయంలో కేంద్రం సీసీఐ ద్వారా ఒక రైతుకు కేవలం 40 క్వింటాళ్ల వరకే కొనుగోలుకు అనుమతిస్తుంది. దానికి మించి తీసుకొస్తే రీ వెరిఫికేషన్ చేయాలని రైతులను ఇబ్బంది గురిచేస్తుంది . రైతులు స్వయంగా పట్టాదారు పాస్ బుక్ తో రావాలి. లేదంటే వారి రక్త సంబంధికుల రేషన్ , ఆధార్ కార్డులతో మాత్రమే రావాలని మరో షరతు విదిస్తుంది అని అన్నారు .
రైతుబంధు డాటా ఆధారంగా రాష్ట్రం వద్ద ప్రతి ఎకరా, ప్రతి గుంట వారీగా రైతుల, పంటల వారీగా ప్రభుత్వం వద్ద వివరాలు ఉన్నాక ఈ నిబంధన ఎందుకు ఎత్తేయాలి అని డిమాండ్ చేసారు మంత్రి . రైతు ఖాతాలోనే డబ్బులు జమ అవుతున్న నేపథ్యంలోనూ ఈ నిబంధనలు అర్దరహితం అని , పత్తి కొనుగోళ్లలో షరతులపై తెలంగాణ ప్రభుత్వం తరపున సీసీఐకి లేఖలు రాశాం అయినా స్పందించటం లేదు అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు .

సింగర్ సునీత పెళ్లి : రెండోసారి చేసుకునేది ఎవరిని అంటే ?

Most Popular

టోక్యో ఒలింపిక్స్ 2021: పివి సింధు విజయారంభం- Excellent

టోక్యో ఒలింపిక్స్ 2021 : కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడ్డ ఒలింపిక్స్ ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి . మన దేశంకి పతాకం వస్తుంది అని ప్రజలు ఆశించే మన...

Post covid symptoms : కోవిడ్ తగ్గినా తరువాత వచ్చే సమస్యలు ,పాటించవలసిన నియమాలు

Post covid symptoms : కొవిడ్ తగ్గిన తరువాత మనకి వచ్చే సమస్యలు ఏమిటి ,అవి ఎన్ని రోజుల వరకు ఉంటాయి . మనం ఎలాంటి నియమములు పాటించాలి...

అతి భారీ వర్షాలు : 2 రోజులపాటు బారి వర్షాలు … బయటకు రావద్దు వాతావరణ శాఖ

అతి భారీ వర్షాలు : ఎడతెరిపి లేకుండా రెండురోజులుగా వర్షాలు కురుస్తుండడం , వరద నీరు పెరుగుతుండడం, వాగులు , నదులు పెరుగుతుండడంతో అధికారులను , ప్రజా ప్రతినిధులను...

T20 వరల్డ్ కప్ 2021 : భారత్ vs పాక్ … మరో బిగ్ మ్యాచ్

T20 వరల్డ్ కప్ 2021 అక్టోబర్ 17 నుండి ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే . ఈ సారి ఐసీసీ ప్రపంచ కప్ లో మొత్తం నాలుగు గ్రూప్...

Recent Comments