రైల్ జనరల్, స్లీపర్ కోచ్ లు ఏసీ కోచ్ లుగా ఆధునీకరణ – ఇండియన్ రైల్వే

0
841

రైల్ లలో ఇప్పటివరకు సాధారణం గ ఉన్న జనరల్ స్లీపర్ కోచ్ లను ఇండియన్ రైల్వే అదునుకరించే ప్రయత్నాలను మొదలుపెట్ట్టింది. రైల్ లో ఉండే అన్ని కోచ్‌లను ఆధునీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. జనరల్‌ కోచ్‌లను,స్లీపర్‌ కోచ్ లను కూడా ఏసీ కోచ్‌లుగా మార్చాలని ఇండియా రైల్వే శాఖ నిర్ణయించినట్లు సమాచారం . ఆధునీకరించి స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌ను ‌ 3 టైర్‌ టూరిస్ట్‌ క్లాస్‌గా లేదా ఎకానమీ 3 టైర్‌ ఏసీ క్లాస్ పిలుస్తారు. ఇప్పుడు ఉన్న త్రీ టైర్‌ ఏసీ క్లాస్‌కు, ఏసీ స్లీపర్‌ క్లాస్‌కు ఆధునీకరించి కోచ్ లు మధ్యస్థంగాఉంటాయని అధికారులు అంటున్నారు . కపుర్తలా రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీకి ఇప్పటికే ఆదేశాలు జారీచేసిన్నటు తెలుస్తుంది .

రైల్

72 బెర్తులతో ఉన్న స్లీపర్ క్లాస్ కోచ్‌ను 83 బెర్తులతో 3 టైర్‌ ఏసీ టూరిస్ట్‌ క్లాస్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు . మొదటగా దాదాపు 230 కోచ్‌లను ఆధునీకరించే ప్రయత్నం చేయనున్నట్లు సమాచారం. ఏసీ త్రీ టైర్ టూరిస్ట్ క్లాస్ కోచ్‌కు తయారీ ఇప్పుడున్న త్రీ టైర్‌ ఏసీ క్లాస్‌ కోచ్‌ కంటే 10 శాతం అదనంగా ఖర్చు అవుతుంది. రూ.2.8 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఒకొక్క కోచ్ కు ఖర్చవ్వచ్చు అని అంచనా వేస్తున్నారు.

బెర్తులు పెరిగితే ఆదాయం పెరుగుతుంది అని రైల్వే శాఖ భావిస్తుంది . రిజర్వేషన్ లేని ‌ జనరల్‌ కోచ్‌లను 100 సీట్లు చేసి ఏసీ క్లాస్‌ కోచ్‌గా మార్పు చేయాలని నిర్ణయించారు . జనరల్‌ కోచ్‌ల సామర్థ్యం ఇంకా పెంచవచ్చా అనే ఆలోచనతో డిజైన్‌ తుది దశలో రోపకల్పన చేస్తున్నారు తెలుస్తుంది .

గతంలో కోచ్ లలో సీట్ల సంఖ్య ను పెంచడంతో ప్రయాణికులు ఇబ్బంది ఎదుర్కున్న సందర్భాలు ఉన్నాయి . రైళ్లలో సైడ్ మిడ్ల బెర్త్ లు ప్రవేశ పెట్టడం ,ప్రయాణికుల నుండి పిర్యాదులు రావడంతో వాటిని తొలగించారు . అధికారులు మాత్రం కొత్తగా ఆధునీకరించి కోచ్ లలో అలంటి పరిస్థితి రాదని అంటున్నారు

గంగ అవ్వ bigg boss 4 -జీవిత చరిత్ర – మై విలేజ్ షో స్టార్