లక్షన్నర టిప్ 10 వేళా బిల్లుకు అంతఇచ్చాడు- Awesome

3
1269
లక్షన్నర టిప్ సర్వ్ చేసిన వ్యక్తికి ఇచ్చాడు అంటే ఎంతో పెద్ద పంక్షన్ చేసి కోటి రూపాయిల బిల్లు అయితే అనుకోవచ్చు . కానీ ఇక్కడ ఆవ్యక్తి కి అయినా బిల్ కేవలం 10 వేలు మాత్రమే . 10 వేలకు ఏకంగా లక్ష నలపై ఐదు వేలు ఇచ్చాడు . అంత ఇచ్చాడు అంటే వాడు కొంచెం తేడా అనుకుంటున్నారా . ఎందుకు ఇచ్చాడో తెలిస్తే మీరు సెల్యూట్ చేస్తారు చికాగో కి చెందిన సదరు వ్యక్తికి .
లక్షన్నర టిప్

చికాగోలోని క్లబ్ లక్కీ అనే రెస్టారెంట్ కు ప్రతి ఫిబ్రవరి నెల 14 వ తారీకు ఆ వ్యక్తి తన భార్యతో వస్తాడు . ఎప్పుడు తాను రిజర్వు చేసుకునే టేబుల్ నెంబర్ 46 అదికూడా రాత్రి 7. 30 గంటలకు ఖశ్చితం గా వస్తాడు . భార్యకు నచ్చిన ఆర్డర్ చేసి తినేసి వెళ్ళిపోతారు . అలా 20 ఏళ్ళు గ అదేరోజు వస్తున్నారు . దానికి ఒక కారణం ఉంది .

ఆ వ్యక్తి 20 ఏళ్ళ క్రింద ఆ అమ్మాయికి అదే టైం అదే రోజు అదే టేబుల్ దగ్గర తన ప్రేమను వ్యక్త పరిచాడు . తరువాత ఆ అమ్మయిని పెళ్లి చేసుకొని ఎంతో అందంగా గడుపుతున్నాడు . ప్రతి ఏటా ఫిబ్రవరి 14 న మధురక్షనాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆ రెస్టారెంట్ కి వచ్చి తిని వెళ్తూ ఉంటారు . ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగే ఫిబ్రవరి 14 అదే టైం , అదే టేబుల్ దగ్గర తోలి రోజులను మలివేసుకున్నారు . భార్యకు ఇష్టమైన వి ఆర్డర్ ఇచ్చి తిన్నారు . బిల్లు 137 డల్లర్లు 9(దాదాపు 10వేలు) అయింది . తమ ప్రేమ బంధం ఏర్పడి 20 సంవత్సరాలు అయినా సందర్భంగా సర్వర్లకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాడు . 2000 డాల్లర్లను టిప్ ఇచ్చి దాంతో పాటు సందేశాన్ని రాసి ఇచ్చాడు .

రెస్టారెంట్ వాళ్ళు కూడా వాళ్ళ సంతోషంలో భాగమైనందుకు సంతోషం వ్యక్తపరుస్తూ లక్షన్నర టిప్ స్లిప్ ను సోషల్ మీడియా లో ఉంచుతూ దానికి సంబందించిన స్టోరీ ని జతపరిచారు . ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . నెటిజన్ల కామెంట్స్ తో ఓ పోస్ట్ నిండిపోతుంది .

శాంసంగ్ గెలాక్సీ ఎ12 తక్కువ ధరకే మంచి ఫీచర్స్ తో- Wow

3 COMMENTS

Comments are closed.