వంట గ్యాస్ ఫ్రీ : ఉజ్వల లబ్దిదారులకు 3 నెలలు సరఫరా ? Wow

0
1248
వంట గ్యాస్ ఫ్రీ గా ఉజ్వల (దీపం ) పథక లబ్దిదారులకు కేంద్రం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది . వంట గ్యాస్ ధరలు రోజు రోజుకి పెరుగుతూ ఉండడంతో గృహ వినియోగ దారులకు చాల ఇబ్బందికరంగా మారడం తో కేంద్రం ఉజ్వల లబ్దిదారులకు ఊరట కల్గించే చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది .
వంట గ్యాస్ ఫ్రీ

గత మూడు నెలల కాలంలో సిలిండర్ ధర 225 పెరిగింది . దీనితో దాని ధర రూ . 871. 50 వరకు వెళ్ళింది . అయితే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతూ ఉండడంతో గ్యాస్ ధర కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది . పౌరసరఫరాల శాఖ గణాంకాల ప్రకారం హైదరాబాద్ లో జీహెచ్ఎంసి పరిధిలో 26 లక్షల వంట గ్యాస్ కనెక్షన్స్ ఉండగా దానిలో 1. 42 లక్షల కనెక్షన్స్ ప్రధాన మంత్రి ఉజ్వల పధకం క్రింద ఉన్నారు .

వీరికి వచ్చే ఆర్ధిక సంవత్సరములో మూడు నెలలు ఉచితంగా సిలిండర్ లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది . కరోనా లాక్ డౌన్ సమయంలోను ఉజ్వల పథకం దారులకు మూడు నెలల పాటు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజి కింద సిలిండర్లను సరఫరా చేసారు . ఇప్పుడు కూడా ఆవిధం గానే ఇవ్వాలని కేంద్రం యోచిస్తుంది . మార్కెట్ ధర ప్రకారం కనుగోలు చేసుకుంటే వారి కథలోకి నేరుగా నగదు బదిలీ చేస్తారు.

రియల్ మీ 5జీ ఫోన్ : 108 ఏంపీ కెమెరాతో 8 సిరీస్ రాబోతుంది