వనమా రాఘవ అరెస్ట్ … పార్టీ నుండి సస్పెండ్

0
731
వనమా రాఘవ(vanama raghava) పై పాల్వంచ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దమ్మపేట వద్ద అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ సునీల్ దత్ ధ్రువీకరించారు .
వనమా రాఘవ

ఎమ్యెల్యే వనమా వెంకటేశ్వర్ రావు తనయుడు వనమా రాఘవేంద్ర మీద రామకృష్ణ సుసైడ్ ( ramakrishna sucide) కేసులో ఆరోపణలు రావడంతో అప్పటినుండి అజ్ఞాతంలోకి వెళ్ళాడు . రామకృష్ణ సుసైడ్ లెటర్ , సెల్ఫీ వీడియో ఆధారంగా రాఘవేంద్ర ఫై కేసు నమోదు చేసారు పోలీసులు . ఎట్టకేలకు నాటకీయ పరిణామాల మధ్య దమ్మపేట వద్ద అతనిని దుపులోకి తీసుకున్నారు .

రామకృష్ణ ఆత్మహత్య కేసులో ఆరోపణ వచ్చిన అప్పటినుండి రాఘవేంద్ర తొర్రు రు , హైదరాబాద్ ,చీరాల , సూర్యాపేట , విశాఖపట్నం ,రాజమండ్రికి తిరుగుతూ సిమ్ కార్డులు మారుస్తూ పోలీసులకు చిక్కకుండా చూసుకున్నాడు . ఇదే క్రమంలో మల్లి హైదరాబాద్ వస్తుండగా దమ్మపేట సమీపంలో పోలీసులు అరెస్ట్ చేసారు . ప్రతిపక్షాలనుండి తీవ్ర విమర్శలు రావడంతో తెరాస అధిష్టానం రాఘవను పార్టీనుండి సస్పెండ్ చేసింది .

బ్లాక్ టీ రోజు 2 సార్లు తాగితే ఎంతో ఉపయోగం- Healthy