వరుణ్ తేజ్ పెళ్లి పై అభిమానులకు క్లారిటీ ఇచ్చిన నాగబాబు

1
26361
వరుణ్ తేజ్ పెళ్లి విషయం ఎప్పుడు అయితే తన చెల్లి నిహారిక పెళ్లి అయిందో అప్పటినుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది . అందరి దృష్టి వరుణ్ తేజ్ పైనే పడింది . గతంలో కూడా ఒక ఇంటర్వ్యూ లో నాగబాబు మాట్లాడుతూ మేము వరుణ్ కి పెళ్లి సంబంధాలు చూస్తాము అన్నము కానీ వాడే వద్దంటున్నాడు అని చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్ గ మారింది .
వరుణ్ తేజ్ పెళ్లి

టాలీవుడ్ బ్యాచిలర్స్ అంత లాక్ డౌన్ లో వరుస పెట్టి పెళ్లి బాట పట్టారు . రానా , నితిన్ , నిఖిల్ లతో పాటు కాజోల్ , నిహారిక లాంటి హీరోయిన్స్ కూడా పెళ్లి బాజాలు మోగించారు . ఈ తరుణంలోనే వరుణ్ తేజ్ పెళ్లిపై పుకార్లు పుట్టాయి . ఒక ఫేమస్ యువ హీరోయిన్ తో పెళ్లి అని , వరుణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమాలో నటించిన హీరోయిన్ అని వార్తలు పుట్టుకొచ్చాయి . తరువాత హైదరాబాద్ చెందిన వ్యాపారవేత్త కుమార్తె తో పెళ్లి అని ప్రచారం జరిగింది .

అయితే వీటిపై అధికారికంగా ప్రకటన లేక పోవడంతో అందరిలో ఓకే చర్చ గానే మిగిలిపోయింది . ఇప్పుడు మరోసారి నాగబాబు వరుణ్ తేజ్ పెళ్లి పై అసక్తికరమైన స్టేట్ మెంట్ ఇవ్వడంతో మరోసారి ఈ వార్త మల్లి చక్కర్లు కొడుతోంది .
నాగబాబు ఇన్స్ స్టా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేస్తూ , అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాదానాలు ఇచ్చాడు . ఈ క్రమంలోనే వరుణ్ అన్న పెళ్లి ఎప్పుడు అని ఒకరు అడుగగా , మంచి సంబంధాలు ఉంటె చూడామని వారినే అడిగాడు . ఇంకొక అభిమాని ఎవరినైనా ఇష్టపడితే ,అప్పుడు మీరేం చేస్తారు అని అడగగా , దానికి నాగబాబు మీకు మీకు ఇష్టమైతే నేనేం చేస్తా అంటూ ప్రేమ పెళ్లి అయినా ఒకే అనే హింట్ ఇచ్చాడు . ప్రస్తుతం వరుణ్ తేజ్ f 3 లో నటిస్తున్నాడు .

నాగార్జున సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు- Final

1 COMMENT

Comments are closed.