వాటర్ బాటిల్ రూ.25 వేలు … కస్టమర్ దెబ్బకు రెస్టారెంట్ మైండ్ బ్లాక్

0
1247
వాటర్ బాటిల్ రూ.25 వేలు ఏంటి అనుకుంటున్నారా ! అవును అది ఒక హైదరాబాద్ రెస్టారెంట్ లో జరిగిన సంఘటన . పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేసారు . బిల్లు లో ఉన్నా ధర , వాటర్ బాటిల్ పైన ఉన్న ధర చూసి కన్సూమర్ ఫోరమ్ లో కంప్లైంట్ ఇచ్చారు . దానికి సంబందించిన అన్ని అధరాలు ఇచ్చారు .
వాటర్ బాటిల్ రూ.25 వేలు

చాల మంది రెస్టారెంట్ కి వెళ్లి ఆర్డర్ చేయడం , తినడం బిల్ రాగానే కట్టేయడం చేస్తాము . మనం ఏం ఆర్డర్ చేసాము , దేనికి ఎంత బిల్ ఇచ్చాడు అనేది దాదాపు చాల మంది పట్టించుకోరు . ఎక్కడయినా సరే ఎమ్మార్పీ కన్నా ఒక్క పైసా ఎక్కువ వేసిన మనం అడిగే అధికారం ఉంటుంది . కన్సూమర్ కోర్ట్ కూడా వేళ్ళ వచ్చు . హైదరాబాద్ లోని ఒక వ్యక్తి ఇలానే కోర్ట్ ని ఆశ్రయించాడు . వాటర్ బాటిల్ మీద 10 రూపాయిలు ఎక్కువగా ఛార్జ్ చేసినందుకు రెస్టారెంట్ మీద కంప్లైంట్ చేసాడు .

హైదరాబాద్ కి చెందిన మహ్మద్ మొహిన్ జులై 13 2019 న పంజాగుట్టలోని రెస్టారెంట్ కు వెళ్ళాడు . బాటిల్ రేటు 20 రూ . ఉంటె 30 రూ బిల్ ఎందుకు వేశారు అని అడిగితే సిబ్బంది నిర్లక్ష్య సమాధానం ఇచ్చారు . దీని తో మొహిన్ కన్స్యూమర్ ఫోరమ్ లో కంప్లైంట్ వేసాడు . తనకు రూ 2. 50 లక్షల పరిహారం , కోర్ట్ ఖర్చుల క్రింద 55, 000 రూపాయలు ఇవ్వ వలసిందిగా కోరాడు . రెస్టారెంట్ యాజమాన్యం కూడా ఎక్కువ తీసుకోవచ్చు అని వాదించింది . కానీ ఫోరమ్ అందుకు ఒప్పు కోలేదు . వినియోగ దారుల హక్కులు ముఖ్యం అని గుర్తించి ఫైన్ వేసింది .
వినియోగ దారుడి దగ్గర అదనంగా వాసులు చేసిన రూ . 10 కి ఈ 7 నెలలకు గాను 12 శాతం వడ్డీ కలిపి ఇవ్వాలని అలాగే మానసికంగా వేధించినందుకు రూ . 20,000 బాధితుడికి చెల్లించాలని ఆదేశించింది .వాటర్ బాటిల్ రూ.25 వేలు 45 రోజుల్లో చెలించకపోతే తీవ్రవమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది .

ఏపీ పంచాయతీ ఎన్నికలు తేదీలను మార్చిన ఎన్నికల సంఘం