విజయశాంతి మాట్లాడుతూ కేసీఆర్ ఒక పెద్ద క్రిమినల్, నాకంటే పెద్ద నటుడు, నా పై రెండు సార్లు కుట్ర చేసాడు ,కాంగ్రెస్ కు వెళ్ళిపోతుంది అన్ని ప్రచారం చేయించి ఓయూ లో 5 వేల మంది విద్యార్థులతో నన్ను తిట్టించాడు అని అన్నారు .

కేసీఆర్ ఓ నిజాం రాజు. తెలంగాణ బిల్ పాస్ అయేటప్పుడు కేసీఆర్ సభలో లేడు, అప్పుడు కూడా మోసం చేసాడు. నేను సభలో లేకపోతే తెలంగాణ బిల్ పాస్ అయ్యేది కాదు . ముందుగానే కేసీఆర్ ప్లాన్ చేసుకొని తన కుటుంబానికె పదవులు వచ్చేలా చేసుకున్నాడు . అసలు రాష్ట్రంలో ప్రశ్నించే ప్రతి పక్షమే లేకుండా ప్లాన్ చేసాడు .
తేలంగాణ కోసం చనిపోయిన విద్యార్థుల శేవాల మీద కూర్చొని పరిపాలిస్తున్నావ్ ,తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టి నిన్ను ఇన్ని రోజులు ఊరుకున్నారు, రోడ్ పై నిలబెడుతారు ,రాబోయే ఎన్నికలలో టీఆరెస్ ను ప్రజలు పడుకోబెడుతారు అని హెచ్చరించారు .
టీఆరెస్ కు సరైన పార్టీ బిజెపి అని ,ఎన్ని సార్లు మాయమాటలు చెప్పి మోసం చేస్తావు,కేసీఆర్ కు తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు, డబ్బు పదవుల మీద ప్రేమ ఎక్కువ . కేసీఆర్ ఎన్నికల ముందు మీ సేవకు వెళ్ళండి అన్నాడు, ఇప్పుడు మీ చావు మీరు చావండి అంటున్నాడు.
రాఖీ కట్టడానికి వెళ్ళినప్పుడు నాతో పాటు 9 మంది చెల్లెలు వొచ్చారు,ప్రతి ఒక్కరికి 10,000 ఇస్తామన్నారు . అప్పట్లో కేసీఆర్ వ్యవహారాలు జోగినపల్లి సొంతోష్ చూసేవాడు . ఎక్కడ కేసీఆర్ అన్ని అడిగితే మీకు ఇయాల్సిన లక్ష రూపియల కోసం ఊరు మొత్తం తిరుగుతున్నాడు అని సంతోష్ అన్నాడు . లక్ష రూపాయలు లేని కేసీఆర్ లక్షల కోట్లకు ఎలా వొచ్చాడు అని దుయ్యబట్టింది .